Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బూతు పురాణం వినిపించిన సినీ నటుడు బాలకృష్ణ పీఏ హౌస్ అరెస్టు

ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (14:17 IST)

Widgets Magazine


balakrishna pa sekhar
అనంతపురం జిల్లా హిందూపుర్‌ అసెంబ్లీ నియోజగవర్గానికి చెందిన అధికార టీడీపీ నేతలకు బూతు పురాణం వినిపించిన సిట్టింగ్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్‌ను గృహనిర్బంధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పీఏ శేఖర్‌పై నియోజకవర్గ ప్రజలతో పాటు ఆ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 
 
ఈనేపథ్యంలో హిందూపురంలోని బాలకృష్ణ నివాసంలో పీఏ శేఖర్‌ను హౌస్ అరెస్టు చేశారు. హిందూపురంలో 144 సెక్షన్ విధించినట్లు తెలుస్తోంది. కాగా, బాలకృష్ణ పీఏ వ్యవహారం కేవలం హిందూపురం నియోజకవర్గానికే కాకుండా ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రభావం బాలకృష్ణ ఇమేజ్‌పై పడకుండా ఉండాలనే ఉద్దేశంతో శేఖర్‌ను దూరంగా పెట్టనున్నట్టు తెలుస్తోంది. పీఏ శేఖర్ తీరుపై హిందూపురం టీడీపీ ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్న విషయం తెల్సిందే. 
 
కొన్ని గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు ఏకంగా రహస్య సమావేశాలు నిర్వహించారు. ఇవి స్థానికంగా టీడీపీ శ్రేణుల్లో కలకలం సృష్టించాయి. పైపెచ్చు.. పీఏ పదవి నుంచి శేఖర్ ను తప్పించకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని బాలకృష్ణ కు ఇప్పటికే వారు హెచ్చరించచేశారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేశాకే పీఏ శేఖర్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Tdp Pa Sekhar Hindupur Mla Balakrishna

Loading comments ...

తెలుగు వార్తలు

news

సీఎంగా శశికళ ప్రమాణం చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు : సుబ్రమణ్య స్వామి

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రమాణం చేస్తే అంతకంటే ...

news

నారా లోకేష్‌ బినామీ భాగోతం.. ఆధారాలివిగో..!

నారా లోకేష్‌ కనుసన్నల్లో ఆయన కంపెనీలోని వ్యక్తులకు చెందిన వారి పేర్లతోనే పరిశ్రమలు ...

news

అయ్యా.. ఒక్క ఛాన్స్.. చంద్రబాబు చుట్టూ 'గాలి' ప్రదక్షిణలు

ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదూ.. అదేనండి.. మొన్నీ మధ్య తన పదవిని కొనసాగించాలని ...

news

ఆడో పిచ్చి న్యాయమూర్తి... ఉగ్రవాదులకు మద్దతిస్తాడా? అరెస్టు చేసి జైల్లో పెట్టాలి : డోనాల్డ్ ట్రంప్ నిప్పులు

ఏడు ముస్లిం దేశ పౌరులను అమెరికాలో అడుగుపెట్టనీయకుండా తాను జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ...

Widgets Magazine