బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 22 జులై 2018 (11:57 IST)

అలాంటి పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? టీడీపీ వెనక్కి తిరిగి చూసుకోవాలి?: జనసేనాని

ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని సంపూర్ణంగా వదిలేశారని అలాంటి పార్టీతో రాష్ట్రంలో పొత్తు ఎవరన్నా పెట్టుకుంటారా అని బీజేపీతో దోస్తీపై జనసేనాని పవన్ కల్యాణ్ కుండబద్ధలు కొట్టారు. బీజేపీతో సమానంగా టీడీపీ కూడా

ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని సంపూర్ణంగా వదిలేశారని అలాంటి పార్టీతో రాష్ట్రంలో పొత్తు ఎవరన్నా పెట్టుకుంటారా అని బీజేపీతో దోస్తీపై జనసేనాని పవన్ కల్యాణ్ కుండబద్ధలు కొట్టారు. బీజేపీతో సమానంగా టీడీపీ కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీసి ప్రజలను మోసగించి వంచించారన్నారు.


బీజేపీతో కుమ్మక్కయ్యిందెవరు టీడీపీ ఓసారి వెనక్కి తిరిగి చూసుకొని మాట్లాడాలని సూచించారు. బీజేపీ నష్టం కలగకూడదనే పవన్‌ ట్వీట్లు చేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేనాని గట్టిగా బదులిచ్చారు. జనసేన సొంత ప్రయోజనాల కోసం పనిచేయదని, ఏపీ ప్రజల హక్కు కోసం పోరాడుతుందని కౌంటరిచ్చారు. 
 
బీజేపీని వెనకేసుకొస్తే మాకు వచ్చే లాభమేంటని జనసేనాని ప్రశ్నించారు ప్యాకేజీకి ఒప్పుకొని మళ్లీ యూ టర్న్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని ట్విట్టర్ లోనే కౌంటర్ ఎటాక్ చేశారు. వ్యక్తిగత లాభాల కోసం టీడీపీ ప్రత్యేక హోదాకు మూడున్నరేళ్ల పాటు తూట్లు పొడిచిందని పవన్ పేర్కొన్నారు.

అలాంటి పార్టీ నేతలు ఇప్పుడ వ్యర్థ ప్రసంగాలు చేస్తే లాభమేంటంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నాస్త్రాలు సంధించారు. గజినీ సినిమా హీరో ''షార్ట్ టైం మెమొరీ లాస్‌''తో ఎలా బాధపడతాడో టీడీపీ కూడా ''కన్వినియెంట్ మెమొరీ లాస్ సిండ్రోమ్''తో బాధపడుతోందని పవన్ ఎద్దేవా చేశారు.