Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జేసీ అబద్దాలు చెపుతున్నారు.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న పూసపాటి

శుక్రవారం, 16 జూన్ 2017 (14:38 IST)

Widgets Magazine
ashoka gajapatiraju

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంపై కేంద్ర పౌరవిమానయానమంత్రి పూసపాటి అశోకగజపతిరాజు సీరియస్‌ అయ్యారు. ఈ వ్యవహారంలో జేసీ దివాకర్ రెడ్డి అబద్ధాలు చెపుతున్నారంటూ మండిపడ్డారు. 
 
ముఖ్యంగా వైజాగ్ ఎయిర్ పోర్టుకు గంట ముందే వచ్చానని దివాకర్ రెడ్డి చెప్పారని... కానీ, సీసీటీవీ ఫుటేజీలో అది అవాస్తవమని తేలిందని చెప్పారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. మరోవైపు, చిన్న చిన్న విషయాలు కూడా పార్టీ పరువును దిగజారుస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఇదిలావుండగా, జేసీ దివాకర్ రెడ్డిపై ఇండిగోతో పాటు.. ఏడు ఎయిర్ లైన్స్ సంస్థలు వేటు వేశాయి. దీంతో ఈ ఏడు విమానయాన సంస్థల్లో జేసీ ప్రయాణించేందుకు వీల్లేకుండా పోయింది. మరోవైపు... 'వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లో అసలు ఏం జరిగిందన్న వివరాలను తెలుసుకోవాల్సి ఉంది. దీనిపై చట్ట ప్రకారం నడుచుకుంటాం' అని అశోక్ గజపతి రాజు చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Airport Boarding Pass Late Entry Tdp Lawmaker Jc Diwakar Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఖతార్‌తో అమెరికా భారీ డీల్: ఆయుధాల కోసం 12బిలియన్ల రక్షణ ఒప్పందం

అమెరికా ఇతర దేశాల గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. తన ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తోంది. ...

news

రాష్ట్రపతిగా రాజకీయేతర వ్యక్తి.. తెరపైకి శ్రీధరన్ పేరు : సోనియా ఏమన్నారు?

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా రాజకీయేతర వ్యక్తిని ప్రతిపాదించాలని భారతీయ జనతా పార్టీ ...

news

ప్రేమించలేదనీ రోమియో ఏం చేస్తున్నాడో చూడండి (Video)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది. యువతి ప్రేమించలేదన్న కోపంతో ఓ రోమియో ...

news

ఎస్సై 2 గంటలు ప్రయత్నించినా లొంగని శిరీష...? తేజస్విని ఏం చెప్పింది?

బ్యూటీషియన్ శిరీషపై లైంగిక దాడి జరగడం వల్లే ఆమె మృతి చెంది వుంటుందని తొలుత భావించారు. ...

Widgets Magazine