Widgets Magazine

జగన్ హీరో, రోజా హీరోయిన్.. అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు అనే సినిమా..?

బుధవారం, 12 జులై 2017 (15:32 IST)

Widgets Magazine
JAGAN-ROJA

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హీరోగా, ఆ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా హీరోయిన్‌గా "అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు" అనే పేరిట కొత్త సినిమా తీస్తే బాగుంటుందని ఏపీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్, టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన అనురాధ.. జగన్, రోజాలపై విమర్శలు గుప్పించారు. జగన్‌, రోజాలు రాజకీయాలకు ఏమాత్రం పనికిరారని ధ్వజమెత్తారు. 30 ఏళ్లపాటు సీఎంగా ఉండాలనే అత్యాశలో జగన్ వున్నారని.. అది ఎన్నటికీ నెరవేరబోదని ఆమె అన్నారు. 
 
మద్యం వ్యాపారులను పక్కన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు అనుసరిస్తున్న మద్యం నియంత్రణ విధానంపై విమర్శలు చేసే హక్కు లేదని అనురాధ దుమ్మెత్తిపోశారు. రోజా సినిమా భాషలో చెప్పాలంటే... అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదనే డైలాగును రోజా గుర్తుంచుకోవాలని సెటైర్లు విసిరారు.

రోజా, జగన్ కలసి ఒక సినిమా తీస్తే బాగుంటుందని సూచించారు. ఈ సినిమాకు 'అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు' అనే టైటిల్ పెట్టి.. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం అన్నీ విజయసాయిరెడ్డి అందిస్తే భలే మస్తుగా వుంటుందని అనురాధ ఎద్దేవా చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

స్నేహితుడితో ఒకే గదిలో భార్య.. బట్టలు తీసుకుని పరార్.. రేప్ అంటూ డ్రామా..

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టున్న భార్యను ఓ భర్త ...

news

రష్యాలో పోర్న్ హబ్ యూజర్లకు కొత్త కష్టం: వీడియోలు చూడాలంటే.. సోషల్ మీడియా ద్వారానే?

రష్యాలో పోర్న్ హబ్ యూజర్లకు కొత్త కష్టం వచ్చి పడింది. ఇకపై ఆ పోర్న్ హబ్ వీడియోలు ...

news

ఎమ్మెల్యేలు చనిపోతేనే అభివృద్ధి చేస్తారా?: కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి

అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా నియోజకవర్గాల అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోని ...

news

అసహజప్రవర్తన భరించలేక చీకటి గదిలో పెట్టి తాళం వేశారు.. 20 యేళ్లుగా బందీ

పెళ్లితో ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి. భర్త నిజస్వరూపం తెలుసుకున్న ఆమె అయినవారి వద్దకు ...