పవన్‌కు లూజ్ కనెక్షన్ ఏర్పడిందా..? కుంటుకుంటూ నడుస్తూ?: పవన్ రెడ్డి

శుక్రవారం, 13 జులై 2018 (11:40 IST)

జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై అనంతపురం ఎంపీ జేసీ కుమారుడు పవన్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మాట మార్చారని, టీడీపీతో సఖ్యతగా ఉండి, రాత్రికి రాత్రే పవన్ మారిపోయారని పవన్ రెడ్డి విమర్శించారు. తనకు ఉన్న సమాచారం మేరకు, ఢిల్లీ నుంచి పవన్‌కు ఫోన్ వచ్చిందని చెప్పారు.
pawan kalyan


పవన్ కల్యాణ్‌కు రానున్న ఎన్నికల్లో పది ఓట్లు కూడా రాలవని పవన్ రెడ్డి జోస్యం చెప్పారు. కుంటుకుంటూ నడుస్తూ... కమ్యూనిస్టులను ఒక కర్రగా, మరో పార్టీని మరో కర్రగా ఉపయోగించుకుంటూ అడుగులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
 
ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేనకు అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేశారు. టీడీపీ, వైసీపీలో టికెట్లు రాని వారే జనసేనలో చేరుతారని సెటైర్లు విసిరారు. పవన్‌ కల్యాణ్‌తో తనకు కొంత పరిచయం వుందని.. గుంటూరులో బహిరంగసభ సందర్భంగా పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారో అందరికీ గుర్తుండే ఉంటుందని చెప్పారు. 
 
పవన్‌కు లూజ్ కనెక్షన్ ఏర్పడిందో ఏమోకానీ వున్నట్టుండి యూటర్న్ తీసుకుని మంత్రి నారా లోకేష్‌ను పవన్ టార్గెట్ చేశారని పవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను అప్పుడు టీవీని చూస్తూనే ఉన్నానని... లోకేష్‌ను విమర్శించిన తర్వాత వైసీపీ గురించి ఏమైనా మాట్లాడతారేమోనని తాను భావించానని... అక్రమాలకు పాల్పడిన జగన్‌ను విమర్శిస్తారేమోని ఎదురు చూశానని... కానీ జగన్ గురించి ఉలుకూ పలుకూ లేకుండా ప్రసంగాన్ని ముగించారని మండిపడ్డారు.దీనిపై మరింత చదవండి :  
పవన్ కల్యాణ్ పవన్ రెడ్డి టీడీపీ వైసీపీ నారా లోకేష్ Janasena Party Tdp Leader Pawan Kalyan Jc Pavan Kumar Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రైనర్ ఎంత పనిచేశాడు.. ఓ విద్యార్థినిని రెండో అంతస్థు నుంచి దూకేయమన్నాడు.. (video)

మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు జరుగుతూనే వున్నాయి. తమిళనాడులో ఓ ట్రైనర్.. విద్యార్థినిని ...

news

విషం చిమ్మిన స్టీల్ ప్లాంట్... గాల్లో కలిసిన ఆరుగురి ప్రాణాలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కల్యాణి గెర్డావ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి విషవాయువులు ...

news

బెర్తును షేర్ చేసుకున్న అమ్మాయితో టీటీఈ అసభ్యప్రవర్తన - చెప్పుదెబ్బలు

ఆర్ఏసీ టిక్కెట్‌పై ప్రయాణం చేసేందుకు జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన ఓ అమ్మాయి పట్ల టీటీఈ ...

news

నేడు కాంగ్రెస్‌ పార్టీలోకి కిరణ్‌... ముహూర్తం ఉదయం 11.30

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ...