టీడీపీ కార్యకర్తను వేట కొడవళ్లతో వెంటాడి నరికి చంపేశారు.. కళ్లల్లో కారం చల్లి..?

murder
Last Updated: శనివారం, 10 నవంబరు 2018 (10:26 IST)
టీడీపీ వేట కొడవళ్లతో దారుణంగా హత్యకు గురయ్యాడు. కర్నూలు జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల టీడీపీ అధ్యక్షుడైన సోమేశ్వర గౌడ్‌కు దేవనకొండలో ఓ మద్యం షాపు ఉంది. రాత్రి షాపు మూసేసిన అనంతరం కుమారుడితో కలిసి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో కాపు కాసిన ప్రత్యర్థులు సోమేశ్వర్ కంట్లో కారం చల్లి హత్య చేశారు. 
 
వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో వేటకొడవళ్లతో వెంటాడి మరీ నరికి చంపారు. ఈ ఘటనలో ఆయన కుమారుడు శివ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
తీవ్రంగా గాయపడిన సోమేశ్వర‌ గౌడ్‌ను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :