Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కర్నూలులో టీడీపీ షాక్.. : వైకాపాలో చేరనున్న శిల్పా చక్రపాణి రెడ్డి?

ఆదివారం, 9 జులై 2017 (10:26 IST)

Widgets Magazine
shilpa chakrapani reddy

కర్నూలు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి వైకాపాలో చేరారు. అలాగే, ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా టీడీపీని వీడి వైపాకా అధినేత జగన్ మోహన్ రెడ్డి చెంతకు చేరనున్నారు.
 
భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోటీ చేసేందుకు టీడీపీకి చెందిన శిల్పా బ్రదర్స్ పోటీపడ్డారు. అయితే, టిక్కెట్ కేటాయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాకరించారు. దీంతో కినుక వహించిన శిల్పా మోహన్ రెడ్డి టీడీపీని వీడి వైకాపాలో చేరగా, ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి అదే బాటలో నడువనున్నారు. 
 
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పాచక్రపాణి త్వరలోనే వైకాపాలోకి జంప్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సోదరులకు నంద్యాల నియోజకవర్గంలో మంచి పట్టుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక సోదరుడికి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఆయన సుముఖతతో లేరని తెలుస్తోంది. ఇదేవిషయాన్ని ముందే పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం నంద్యాల ప్రచార బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించలేదు. 
 
సోదరుడి గెలుపు కోసం ఆయన తనవంతు పాత్రను పోషిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సైతం ఆయనకు ఆహ్వానం అందలేదు. ఈ మొత్తం వ్యవహారం నంద్యాల నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ మారే విషయమై శిల్పా చక్రపాణిరెడ్డి నుంచి అధికారిక ప్రకటన వెలువడకున్నా, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఆయన పార్టీని వీడటం ఖాయమని తేలిపోయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆయన జేసీ దివాకర్ రెడ్డి.. విమానం ఎక్కనీయొద్దు :: వెనుదిరిగిన టీడీపీ ఎంపీ!

అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తొలి దెబ్బ ...

news

ఇక ఓపిక లేదు.. ఉ.కొరియాను పీస్.. పీస్ చేసేస్తాం: జిన్ పింగ్‌తో డోనాల్డ్ ట్రంప్

ఉత్తర కొరియా దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ...

news

ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ వరం.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ రాష్ట్ర ప్రజలకు ఓ వరం ప్రకటించారు. ప్రభుత్వ ...

news

కాబోయే అత్త కబురు చేసిందని వెళితే... తాళి కట్టాల్సిన వ్యక్తి గొంతు కోశాడు...

కాబోయ్ అత్త కబురు చేసిందనీ ఎంతో ఆనందంతో ఇంటికి వెళితే కాబోయే భర్త అత్యంత కిరాతతంగా గొంతు ...

Widgets Magazine