ఇంకోసారి పవన్ జోలికి వెళితే.. ఏం చేస్తానంటే... చంద్రబాబు

బుధవారం, 11 అక్టోబరు 2017 (20:21 IST)

chandrababu - pawan kalyan

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కోపం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ విషయంలో కొందరు నాయకులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు ప్రశాంతంగా మాట్లాడాలి. రెచ్చిపోయి మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్‌ మనోడే.. అతన్ని ఎందుకు విమర్శిస్తున్నారు. మీ పని మీరు చూసుకోండి.. పార్టీ గురించి తప్పుగా మాట్లాడటం.. మనకు కావాల్సిన వారి గురించి చెడు ప్రచారం చేయడం మానుకోండి.. ఇదంతా స్వయంగా బాబు చెప్పిన మాటలే.
 
చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలతో టిడిపి నేతలు ఆశ్చర్యపోయారు. నిన్న విజయవాడలో టిడిపి నేతలతో సమావేశమైన బాబు అశోక్ గజపతిరాజు, పితాని సత్యానారాయణ ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్‌ ఎవరో తెలియదంటూ వ్యాఖ్యలు చేయడం, అలాగే విమర్శలు చేయడంపై బాబు మండిపడ్డారు. 
 
పవన్ కళ్యాణ్ పైన బాబు ఆ స్థాయిలో స్పందించడం టిడిపి నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2014 ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావాలని కాలికి బలపం కట్టుకుని తిరిగిన పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క పదవి కూడా ఆశించకుండా వుండటం సామాన్యం కాదు. అందుకే బాబుకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం మరి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నిధులు తేలేని దద్దమ్మ చంద్రబాబు... రోజా తీవ్ర వ్యాఖ్యలు

వైఎస్సార్సీపి ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు ...

news

మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే : సుప్రీంకోర్టు ధర్మాసనం

మైనర్ భార్యతో శృంగారం చేయడం అత్యాచారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 15 ...

news

హ్యాకింగ్ వల్లే అమెరికా కుట్రను బయటపెట్టాం: ఉత్తరకొరియా హ్యాకర్లు

అమెరికా లక్ష్యం తమ దేశాధ్యక్షుడిని హతమార్చేందుకు.. దానికి దక్షిణ కొరియా పూర్తి సహకారం ...

news

జగన్ ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామా చేసేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత ...