Widgets Magazine

ఆలీ బాబా అందరూ దొంగలే.. షర్మిలకు అంత సీన్ లేదు.. జగన్ జైలుకు పోతాడనే?

సోమవారం, 10 జులై 2017 (20:07 IST)

Widgets Magazine
ys jagan

రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం మద్యం దుకాణాలు వైకాపా నేతలకు చెందినవేనని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్‌ వారిని వ్యాపారం మాన్పించాకే ప్రజలకు హామీ ఇవ్వాలని సూచించారు. మద్యం తాగనిదే నిద్రపోని వ్యక్తులంతా వైకాపాలోనే ఉన్నారని రవీంద్ర విమర్శించారు. నిత్యం మందు తాగే వ్యక్తులు మద్యపాన నిషేధం గురించి మాట్లాడటం హాస్యాస్పందంగా ఉందన్నారు.
 
అలాగే సీఎం చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని విమర్శించే అర్హత షర్మిలకు లేదన్నారు. రాజకీయం చేతగానే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే ప్రశాంత్‌ కిశోర్‌ను కూడా తెచ్చుకున్నారన్నారు. చంద్రబాబును విమర్శించేందుకే జగన్‌ పార్టీ ప్లీనరీని ఏర్పాటుచేశారని అన్నారు.
 
మరోవైపు.. మంత్రి కె.ఎస్‌.జవహార్‌ మాట్లాడుతూ.. వైకాపా ప్లీనరీని పరిశీలిస్తే.. ఆలీ బాబా అందరూ దొంగలే అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్లీనరీలో ప్రశాంత్‌ కిశోర్‌ను పరిచయం చేసి ఆయనే సారథ్యం వహిస్తారని చెప్పడం ద్వారా తాను జైలుకు పోతాను అని ప్రతిపక్షనేత చెప్పకనే చెప్పారన్నారు.  
 
టీడీపీ నేతలే కాకుండా..కాంగ్రెస్ నేతలు కూడా వైకాపా చీఫ్ జగన్‌పై ఫైర్ అవుతున్నారు. పొరపాటున జగన్ సీఎం అయితే కనుక వీధికో రౌడీ తయారవుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ సీఎం కావాలనే కోరిక పగటికలగానే మిగిలిపోతుందన్నారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్.. ఒకవేళ కేసుల నుంచి బయటపడ్డా, ప్రజాకోర్టు నుంచి తప్పించుకోలేరని అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దేవుడు పిలిచాడట.. ఉరేసుకున్న ముగ్గురు మహిళలు.. ఎక్కడ?

సాంకేతికత ఎంత పెరిగినా.. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటివి లోకాన్ని అద్దంలా ...

news

తోక పట్టుకున్న వ్యక్తి చేతులు కొరికేసిన షార్క్ చేప.. వీడియో చూడండి..

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో మూగజీవులతో సెల్ఫీలు.. క్రూర మృగాలతో సాహసాలు చేయడం ...

news

ఆడ తోడు లేక మగ జిరాఫీ మృతి..ఎక్కడ(వీడియో)

ఒకటి రెండు కాదు 7 సంవత్సరాల పాటు ఒంటరిగానే గడిపింది ఆ జిరాఫీ. ఆడ తోడు లేక ...

news

యువతి పైట లాగుతున్న ఫోటో... భాజపా కైలాష్ షేర్... ఏం జరుగుతోంది?

సోషల్ మీడియాలో చేసే పోస్టింగుల వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం. వాస్తవ వార్త ఏమిటో ...