Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎమ్మెల్యే బాలయ్య ఇలాకాలో పీఏ రాజ్యం... నేతల రహస్య భేటీ... హిందూపూర్‌లో కలకలం

మంగళవారం, 31 జనవరి 2017 (14:35 IST)

Widgets Magazine
Balakrishna

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం హిందూపూర్. ఇక్కడ ఆయన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రాజశేఖర్ పాలన సాగుతోంది. దీన్ని స్థానిక టీడీపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో నేతలంతా ఐక్యమై ఒక రహస్య సమావేశం నిర్వహించారు. ఈ విషయం తెలియగానే బాలకృష్ణతో పాటు టీడీపీ అధిష్టానం కూడా ఉలిక్కిపడింది. పైగా ఈ రహస్య సమావేశంపై ఆరా తీస్తోంది. 
 
ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ గత కొన్ని రోజులుగా సినిమాల్లో బిజీగా ఉండటంతో నియోజకవర్గ రాజకీయాలపై దృష్టిసారించలేక పోయారు. దీంతో నియోజకవర్గంలో పీఏ రాజశేఖర్ పాలన సాగుతోంది. ఆయన పాలనపై టీడీపీ సీనియర్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రూరల్‌ మండలం కిరికెరలో టీడీపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చ జరిగిన అంశాలు సోమవారం పార్టీ వర్గాలకు చేరువ కావడంతో నియోజకవర్గంలో రోజంతా చర్చలు సాగాయి. ఈ విషయం అధికార పార్టీతో పాటు ప్రతిపక్షంలోనూ చర్చలకు దారితీసింది. 
 
ముఖ్యంగా కొన్నాళ్లుగా పార్టీలో తటస్థంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, నాయకులు అంబికా లక్ష్మీనారాయణలు ఈ సమావేశానికి హాజరుకావడం మరింత చర్చలకు తెరలేపింది. పార్టీలో కార్యకర్తస్ధాయి నుంచి సీనియర్‌ నాయకుల వరకు బాలయ్య ఇలాఖాలో ఇలాంటి సమావేశమా? అన్న చర్చలు వినిపించాయి. సమావేశంపై అంతర్గతంగా పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసింది. 
 
అయితే ఈ రహస్య సమావేశాలపై పార్టీ క్యాడర్‌ మాత్రం వేచి చూస్తూ నోరు మెదపకపోవడం గమనార్హం. రహస్య సమావేశాలపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందిస్తారా? ఇవి ఇలాగే కొనసాగితే ఏ స్థాయికి దారి తీస్తాయో అన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రంప్ ఆదేశాలను అమలు చేయనంటే చేయను.. అటార్నీ జ‌న‌ర‌ల్ స‌ల్లీ యేట్స్‌ పై వేటు

ఏడు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన ఇమ్మిగ్రేషన్ ఆదేశాలపై ...

news

అమెరికాలో ఇండియన్ టెక్కీలకు ట్రంప్ షాక్... రూ.87,00,000 జీతం వుంటేనే... లేదంటే పొండి...

డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లే అమెరికాలోని ఎన్నారైలను ఖాళీ చేయించే దిశగా అడుగులు ...

news

ఇండియన్ టెక్కీలకు ముచ్చెమటలు... అమెరికా సభకు హెచ్1 బీ వీసాల సంస్కరణ బిల్లు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనిచేస్తున్నారు. తన ...

news

జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్న నాగబాబు.. తమ్ముడికి తోడుగా..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మెగా బ్రదర్ నాగబాబు చేతులు కలుపనున్నట్లు వార్తలు ...

Widgets Magazine