Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎమ్మెల్యే - ఎమ్మెల్యీ వర్గాల మధ్య వ్యక్తిగత కక్షలు.. ఇద్దరి హత్య

శనివారం, 20 మే 2017 (09:43 IST)

Widgets Magazine
murder

ప్రకాశం జిల్లాలో రాజకీయంగా ఉన్న వ్యక్తిగత కక్షలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గాల మధ్య గత కొంతకాలంగా తారా స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్న బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు కర్రలతో విచక్షణ రహితంగా దాడిచేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. 
 
ఈ ఘర్షణలపై పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. కరణం వర్గానికి చెందిన గోరంట్ల వెంకటేశ్వర్లు, అంజయ్య (48), పేరయ్య, యోగినటి రామకోటేశ్వరరావు (40) ముత్యాలరావు, వీరరాఘవులు రెండు ద్విచక్ర వాహనాలపై రాజుపాలెంలోని బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరై తిరిగి స్వగ్రామం బయలుదేరారు.
 
గ్రామ సమీపంలోకి రాగానే ఎమ్మెల్యే రవికుమార్ వర్గీయులైన మాలెంపాటి వెంకటేశ్వర్లు, గొట్టిపాటి మారుతి, శాఖమూరి సీతయ్యతోపాటు మరో 40 మంది వారి కళ్లలో కారం కొట్టి కర్రలతో దాడి చేసి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా గోరంట్ల అంజయ్య, యోగినాటి రామకోటేశ్వరరావు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

క్యాన్సర్‌ చంపలేదు... ఆస్తి కోసం నా భర్తే చంపేశాడు : తల్లి సుమశ్రీ

నా కుమార్తెను క్యాన్సర్ చంపలేదని ఆస్తి కోసమే నా భర్త చంపేశాడని ఇటీవల క్యాన్సర్ వ్యాధితో ...

news

తెలంగాణ-ఏపి మధ్య వివాదాల్లేవు... కానీ సెక్షన్ 108 పొడిగించాల్సిందే... కాల్వ, పరకాల

అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని సమాచార శాఖ మంత్రి కాలవ ...

news

ఓపీఎస్‌కు మోడీ పిలుపు.. సీఎం రేసులో రజనీకి పోటీ? బీజేపీలో చేరమంటారా?

తమిళనాట రాజకీయాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు ...

news

సీబీఐ తనిఖీల దెబ్బ : లండన్‌కు చిదంబరం కొడుకు... అరెస్టు భయమా?

కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం కుమారుడు ...

Widgets Magazine