Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాంగ్రెస్ తలుపులు మూసి చేస్తే.. బీజేపీ తలుపులు తెరిచే ముంచేసింది : టీడీపీ ఎమ్మెల్యే

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (16:36 IST)

Widgets Magazine
modugula venugopal reddy

పార్లమెంట్ తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేస్తే, ఇపుడు అధికారంలో ఉన్న బీజేపీ తలుపులు తెరిచే నిలువునా అన్యాయం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల విత్తమంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం చేసిన విషయం తెల్సిందే. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. 
 
తలుపులు మూసి విభజన బిల్లుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు సమాధి కట్టారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే, బీజేపీ కూడా ఇపుడు తలుపులు తెరిచి అన్యాయం చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.
 
ఇకపోతే, మరో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీప్రభుత్వంపై తమ భ్రమలు పటాపంచలయ్యాయన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రతి సీమాంధ్రుడి గుండె రగలిపోతోందన్నారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని, ఇంకా బీజేపీని పట్టుకుని వేలాడటం సరికాదన్నారు. తెగదెంపులపై పదిరోజుల్లో ఏదోఒకటి తేలిపోతుందని, ఓపిక నశిస్తే తెలుగువారు తిరగబడతారని బుచ్చయ్యచౌదరి హెచ్చరించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రజలు మాకు తలాక్ చెప్పే రోజులు దగ్గరపడ్డాయ్ : బీజేపీ ఎంపీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బద్ధశత్రువుగా ఉన్న బీజేపీ ఎంపీల్లో సినీ నటుడు శత్రుఘ్నసిన్హా ...

news

జైట్లీ బడ్జెట్‌ సెగలు : బీజేపీ ఎంపీలకు ఓటమి భయం

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజల్లోనే కాకుండా ...

news

ఉ.కొరియాకు పెనుముప్పు పొంచివుంది.. ఆ దేశాలను వదలం: అమెరికా

ఉత్తర కొరియా, అమెరికాల మధ్య త్వరలో యుద్ధం జరిగే అవకాశాలున్నట్లు ప్రపంచ మీడియా ...

news

నాతో నిశ్చితార్థం చేసుకుని వేరొకడితో సన్నిహితంగా వుంటోంది.... అందుకే చంపేశా

హయత్ నగర్‌లో యువతి దారుణ హత్య కేసులో కాబోయే భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తేలడంతో అతడిని ...

Widgets Magazine