శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 17 ఏప్రియల్ 2017 (03:13 IST)

దళితులపై అంత ప్రేమ ఉంటే దళితురాలిని ఎందుకు పెళ్లాడలేదు? శివప్రసాద్‌ను కెలికిన బుద్ధా వెంకన్న

శివప్రసాద్ దళితుల కొసం పొరాడేవాడైతే, దళితులను ఎందుకు పెళ్లి చేసుకొలేదు’ అని ప్రశ్నించారు. శివప్రసాద్‌ మంత్రిగా ఉన్నప్పుడు దళితుల ఇండ్లలో ఏనాడైనా భోజనం చేశారా? దళితులపై ఆయనకు ప్రేమ ఉంటే ఆ వర్గానికి చెందినవారిని ఎందుకు పెళ్లిచేసుకోలేదు అవసరం కోసం దళితు

దళితుల పట్ల సీఎం చంద్రబాబుకు పట్టింపు లేదని, తనవంటివారిని కన్నెత్తి చూడటం కూడా ఆయనకు ఇష్టం ఉండదని రాజకీయ విమర్శలు చేసిన టీటీపీ చిత్తూరు ఎంపీ శిపవ్రసాద్‌పై వ్యక్తిగత బురద చల్లడానికి తెదేపా నేతలు సిద్ధమైపోయారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రులు జవహర్‌, అమర్‌నాథ్‌రెడ్డిలు శివప్రసాద్‌ను ఉద్దేశించి ఘాటుగా స్పందించగా,  తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరో అడుగు ముందుకువేసి శివప్రసాద్‌ వ్యక్తిగత విషయాలను టార్గెట్‌ చేశారు.
 
 
శివప్రసాద్ భూకబ్జా ఫైల్ పై సంతకం పెట్టక పోవడం వల్లే చంద్రబాబును దళిత ద్రోహి అని విమర్శిస్తున్నాడని బుద్దా వెంకన్న ఆరోపించారు. శివప్రసాద్‌కి రాజకీయ బిక్ష పెట్టింది చంద్రబాబేనని, కుప్పంలో వచ్చిన మెజార్టీ వల్లే చిత్తూరు ఎంపీగా శివప్రసాద్ గెలిచిన సంగతి గుర్తుచేసుకోవాలన్నారు. చంద్రబాబు మద్దతు లేకుంటే చిత్తూరు ఎంపీ నియోజకవర్గంలొ శివప్రసాద్‌ సర్పంచ్‌గా కుడా గెలవలేరని బుద్ధా అన్నారు.
 
ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడిన బుద్ధా.. ‘శివప్రసాద్ దళితుల కొసం పొరాడేవాడైతే, దళితులను ఎందుకు పెళ్లి చేసుకొలేదు’ అని ప్రశ్నించారు. శివప్రసాద్‌ మంత్రిగా ఉన్నప్పుడు దళితుల ఇండ్లలో ఏనాడైనా భోజనం చేశారా? దళితులపై ఆయనకు ప్రేమ ఉంటే ఆ వర్గానికి చెందినవారిని ఎందుకు పెళ్లిచేసుకోలేదు అవసరం కోసం దళితులను వాడుకోవడం శివప్రసాద్‌ నైజం. మరోసారి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తిరుపతి వచ్చి భాగోతం బయటపెడతా’ అని బుద్ధా వెంకన్న విమర్శించారు.
 
కానీ శివప్రసాద్ రాజకీయపరంగా చేసిన విమర్శలను రాజకీయంగా ఎదుర్కోకుండా ఆయన వ్యక్తిగతంపైకి ఎక్కుపెట్టడం బురద జల్లే కార్యక్రమమేనని రాజకీయ వరిశీలకుల బావన. ఈ లెక్కన ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ మంత్రి పేదల ఇళ్లలో భోంచేస్తున్నారో, పేదలను ఏమేరకు పట్టించుకుంటున్నారో నిజాలను కెలికితే రాజకీయ నేతలందరి భండారం బయటపడుతుంది. పేదలపట్ల రాజకీయం పేరుతో నటించడం, షో బిజినెస్ చేయడం కాకుండా వారి సంకేమం కోసం నేతలు పాటుపడి ఉండి 70 ఏళ్లుగా ప్రజల నెత్తిన దారిద్ర్యం మోతభారంగా ఎందుకుంటోందన్నది పరిశీలకుల ప్రశ్న.