శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (16:26 IST)

మహిళా కౌన్సిలర్‌పై టీడీపీ కౌన్సిలర్ అనుచిత ప్రవర్తన: వీడియో తీశాడని..?

వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన మహిళా కౌన్సిలర్ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ.. ఆమెను వీడియో తీశాడనే ఆరోపణలతో పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. తనను వీడియో తీస్తుండటాన్ని గమనించిన ఆ మహిళా కౌన్సిలర్, ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించగా, టీడీపీ కౌన్సిలర్ దురుసుగా వ్యవహరించాడని వైకాపా నేతలు విమర్శించారు.
 
మహిళా కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన కౌన్సిలర్‌ను ప్రశ్నించేందుకు వెళ్తే.. తమపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఈ మేరకు మునిసిపల్ సమావేశ మందిరంలో బైఠాయించిన వైకాపా నేతలు, తెలుగు దేశం కౌన్సిలర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
కాగా తెలుగు దేశం-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. వైకాపా-టీడీపీ నేతల మధ్య నువ్వా నేనా అని మాటల యుద్ధం సాగుతున్న నేపథ్యంలో.. ఇరు పార్టీల నేతల మధ్య హత్యా రాజకీయాలు కూడా జరిగినట్లు ఆరోపణలున్న సంగతి తెలిసిందే.