శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (15:41 IST)

ఢిల్లీలో ఏపీ సెగలు : జైట్లీకి - వెంకయ్యలకు టీడీపీ షాక్.. మోడీతో రాజ్‌నాథ్

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడులకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు తేరుకోలేని షాకిచ్చారు. బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్‌ను వేదికగా చేసుకుని టీడీపీ ఎంపీలు ని

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడులకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు తేరుకోలేని షాకిచ్చారు. బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్‌ను వేదికగా చేసుకుని టీడీపీ ఎంపీలు నిరసలు చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో పార్లమెంట్ ఉభయసభల సభాకార్యక్రమాలు దద్ధరిల్లిపోతున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాని మోడీ కలుగజేసుకుని టీడీపీ ఎంపీలతో మాట్లాడాల్సిందిగా జైట్లీ, వెంకయ్యలను కోరారు. 
 
ప్రధాని సూచనతో టీడీపీ ఎంపీలను వెంకయ్య, అరుణ్ జైట్లీలు చర్చలకు పిలిచారు. అయితే ఈ చర్చలకు వెళ్లేందుకు టీడీపీ ఎంపీలు విముఖత వ్యక్తంచేశారు. విభజన హామీలపై స్పష్టత వస్తే తప్ప తాము చర్చలకు వచ్చేది లేదంటూ చర్చలకు టీడీపీ ఎంపీలు తేల్చిచెప్పినట్టు సమాచారం. 
 
మరోవైపు, ప్రధాని మోడీతో భేటీ అయిన వివరాలను కేంద్రమంత్రి సుజనా చౌదరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఏపీకి న్యాయం చేస్తాం.. తొందరపడవద్దని సుజనాకు మోడీ హామీ ఇచ్చినట్లు సమాచారం. మోడీతో భేటీ తర్వాత చంద్రబాబుకు ఫోన్ చేసి సుజనా చౌదరి వివరాలు తెలియజేశారు. ఏపీలో పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను మోడీకి వివరించానని ఆయన చెప్పారు. 
 
అవసరమైతే చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడతానని మోడీ చెప్పినట్లు తెలియవచ్చింది. ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమని, న్యాయం చేస్తామని, ఏ విషయంలోనూ తొందరపడవద్దని సుజనాకు ప్రధాని హామీ ఇచ్చినట్లు సమాచారం.
 
మరోవైపు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌‌... తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ... టీడీపీ ఎంపీలు అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో ఉభయ సభల నిర్వహణకు ఆటంకం కలుగుతోంది. 
 
ఇదిలావుండగా, మంగళవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీ విభజన హామీల అమలుపై వీరిమధ్య చర్చ జరిగింది. కాగా... ప్రధానితో భేటీకి వెళ్లే ముందు టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ను రాజ్‌నాథ్‌సింగ్ పిలిపించుకుని మాట్లాడినట్టు తెలుస్తోంది.