Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

2019 ఎన్నికల్లో తెదేపా-145 వైసీపికి 35 స్థానాలే... అంత ధీమా ఎందుకో...

మంగళవారం, 23 జనవరి 2018 (17:12 IST)

Widgets Magazine
somireddy

అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకున్నట్లు కనబడుతోంది. తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ ప్రజాయాత్ర చేపట్టేందుకు కొండగట్టును పాయింట్ గా చేసుకుని మొదలుపెట్టారు. ఇక ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఎంత బలం వుందన్న దానిపై అప్పుడే రకరకాల సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ అయితే 2019 ఎన్నికల్లో వైసీపీకి 13 ఎంపీ స్థానాలు వస్తాయని, టీడీపి కూటమికి 12 ఎంపీ స్థానాలు ఖాయమని తేల్చింది. 
 
ఐతే ఇదంతా వట్టి ట్రాష్ అంటున్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న స్థానాలని మించి కైవసం చేసుకుంటుందనీ, ఏకంగా 135 నుంచి 145 స్థానాలను రాబట్టుకుంటుందని వెల్లడించారు. తెదేపా విజయం సాధించబోయే స్థానాల్లో వైసీపి నుంచి అభ్యర్థులు కూడా పోటీ చేసే పరిస్థితి లేదని వెల్లడించారు. మహా వైసీపీ 30 నుంచి 35 స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందేమోనని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో తన బలం ఎంతో తెలుసుకునేందుకు 2019 ఎన్నికలు వేదిక అవుతాయని అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఈ నెయిల్ పాలిష్ ధర రూ.1,63,66,000- అందులో ఏముంది?

లగ్జరీ లైఫ్ విన్నాం.. లగ్జరీ నెయిల్ పాలిష్ కూడా వచ్చేసింది. గతంలో మోడల్స్ ఓన్ అనే సంస్థ ...

news

భార్యతో సఖ్యంగా లేను సునీతను త్వరలోనే పెళ్లి చేసుకుంటా : సీఐ మల్లికార్జున రెడ్డి

తమ మధ్య వివాహేతర సంబంధం లేదనీ కానీ మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుందామని భావించామని ...

news

సీఐతో నా భార్య ఏఎస్పీ సునీతారెడ్డికి అక్రమ సంబంధం.. భర్త సురేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని సీఐ మల్లికార్జున రెడ్డికి, అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ ...

news

వందేమాతరంకు ఉన్నంత శక్తి జై తెలంగాణకు ఉంది : పవన్ కళ్యాణ్

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ చేసిన జై తెలంగాణ నినాదం దేశ స్వాతంత్ర్యం ...

Widgets Magazine