Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమించలేదనీ కాల్‌గర్ల్‌ అంటూ పోస్టులు.. టెక్కీ అరెస్టు

బుధవారం, 6 డిశెంబరు 2017 (09:31 IST)

Widgets Magazine
arrest logo

తనను ప్రేమించని కారణంగా ఓ యువతిని కాల్‌గర్ల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నూలుకు చెందిన సందీప్ కుమార్ గుప్తా అనే టెక్కీ చెన్నైలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయన ఓ యువతిని ప్రేమించగా, ఆ యువతి ప్రేమను నిరాకరించింది. దీంతో ఆ యువతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు తన పేరున నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి అసభ్యకర సందేశాలు పోస్టు చేయసాగాడు. అంతటితో ఆగకుండా తనతో పాటు కుటుంబసభ్యుల సెల్‌ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో (లోకోంటో, బ్లాగ్‌ స్పాట్‌)లో కాల్‌గర్ల్‌గా పోస్టు చేసి వేధించాడు. 
 
ఈ విషయాన్ని పసిగట్టిన బాధిత యువతి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు కాల్‌డేటా, ఐపీ వివరాల ఆధారంగా మంగళవారం ఉదయం నిందితుడు సందీప్‌ను అరెస్టు చేసి మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మియాపూర్‌లోని కూకట్‌పల్లి 16వ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దివ్యాంగుడని ముందే చెప్పలేదు.. ఏడడుగులు వేసే లోపే కనిపెట్టేశారు..

పెళ్లికుమారుడు దివ్యాంగుడనే విషయాన్ని దాచిపెట్టారు. ఈ విషయం దండలు మార్చుకునే సమయంలోనే ...

news

బ్లాక్ డే : దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

బాబ్రీ మసీదు విధ్వంస రోజైన డిసెంబర్ ఆరో తేదీని దేశంలో బ్లాక్‌ డేగా నిర్వహిస్తున్నారు. ఈ ...

news

ఆర్కేనగర్ బైపోల్ : విశాల్ నామినేషన్ ట్విస్ట్.. నో-ఎస్-నో

చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసి తన ...

news

ఎట్టకేలకు ఆర్‌కే నగర్ బరిలో "పందెం కోడి"

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్.కే నగర్ అసెంబ్లీ స్థానానికి ...

Widgets Magazine