మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (19:27 IST)

కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీట్: Nov 5నుంచి బడ్జెట్ సమావేశాలు!

కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా.. నవంబర్ 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలోభాగంగా 5వ తేదీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంతో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారని సమాచారం. నవంబర్ 6న అసెంబ్లీకి సెలవు. నవంబర్ 23 వరకు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
కేబినేట్ సమావేశం సందర్భంగా జిల్లాల వారీగా అవసరాలను, సమస్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ భేటీలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణభవన్‌కు చేరుకున్నారు.