గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (12:11 IST)

ప్రాణత్యాగం చేసిన పోలీసుల కుటుంబాలకు భారీ ఎక్స్గ్రేషియా: కేసీఆర్

బాధ్యతల నిర్వహాణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియా భారీగా పెంచుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో మంగళవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనం నిర్వహించారు.
 
ఈ వేడుకలకు హాజరైన కేసీ‌ఆర్ ప్రసంగిస్తూ... ఎవరికి ఏ ఆపద వచ్చినా తమ ప్రాణాలను సైతం లెక్క చేయక  ముందుండేది పోలీసులే అని తెలిపారు. బాధ్యతల నిర్వహణ ప్రాణ త్యాగం చేసిన కానిస్టేబుల్ ఆపై సిబ్బంది కుటుంబాలకు రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల కుటుంబాలకు రూ. 30 లక్షలు నుంచి రూ. 45 లక్షలు, డీఎస్పీ స్థాయి అధికారికి కుటుంబాలకు రూ. 30 లక్షల నుంచి  రూ. 50 లక్షలు, అలాగే ఐపీఎస్ అధికారుల కుటుంబాలకు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి పెంచుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
 
అదేవిదంగా ప్రస్తుతం కానిస్టేబుళ్లకు రోజువారి చెల్లిస్తున్ జీతం రూ. 90 నుంచి రూ. 250కి పెంచుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య భద్రత కింద ప్రస్తుతం ఉన్న రూ. లక్షను రూ. 5 లక్షలు పెంచుతున్నట్లు తెలిపారు. సింగపూర్ తరహాలో పోలీసులు వ్యవస్థను పటిష్ట పరుస్తామన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, హోం మంత్రి నాయని నరసింహరెడ్డితోపాటు పలువురు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.