బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 జులై 2016 (15:33 IST)

ఎంసెట్-2 లీక్ వాస్తవమే... 30 మంది విద్యార్థులు లబ్ధి: టీఎస్ సీఐడీ

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయిన మాట నిజమేనని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రం లీక్‌తో 30 మంది వరకూ విద్యార్థులు లబ్ధి పొందినట్టు తమ విచారణలో వెల్లడై

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయిన మాట నిజమేనని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రం లీక్‌తో 30 మంది వరకూ విద్యార్థులు లబ్ధి పొందినట్టు తమ విచారణలో వెల్లడైందని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ కేసుకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. పరీక్ష జరిగే సమయానికి రెండు రోజుల ముందు వీరికి ప్రశ్నాపత్రాన్ని నిందితులు ఇచ్చారని నిర్ధారించారు. 
 
విద్యార్థులను ముంబై, బెంగళూరు ప్రాంతాలకు తీసుకువెళ్లి, అక్కడ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి ముందుగానే ప్రిపేర్ చేయించి, పరీక్ష సమయానికి ఎగ్జామ్ సెంటర్లకు చేర్చారని, ఈ కేసులో సంబంధం ఉన్నవారిని అదుపులోకి తీసుకోనున్నామని తెలిపారు. లాభం పొందిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులనూ కూడా అరెస్టు చేసే ఆలోచనలో ఉన్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు.