శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (15:06 IST)

లక్కంటే అది.. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

దేశంలో నిరుద్యోగ శాతం విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా, కేంద్రం ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నిరుద్యోగ శాతం విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం సర్కారు పూర్తిగా మరిచిపోతోంది.
 
ఇలాంటి పరిస్థితులు, కఠిన పోటీలో కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఒకేసారి ఏకంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేసింది. ఆ యువతి పేరు జటంగి సువర్ణ. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్‌ గ్రామ యువతి, ఏకంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. 
 
ఎమ్మెస్సీ బీఈడీ పూర్తిచేసిన ఈ యువతి.... గురుకుల సైన్స్‌ టీచర్‌గా, పంచాయతీ కార్యదర్శిగా ఒకేసారి రెండు ఉద్యోగాలు సంపాదించింది. తాను రాసిన రెండు ప్రవేశ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో విజయం సాధించింది. 
 
నెమ్మికల్‌‌లో ఇంటర్ వరకూ, సూర్యాపేటలో డిగ్రీని, ఉస్మానియాలో ఎంఎస్‌సీ ఆపై బీఈడీని పూర్తి చేసిన ఆమె, తాను అటెంప్ట్ చేసిన రెండు ఉద్యోగాలకూ ఎంపికైంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, నెమ్మికల్ గ్రామస్తులు తమ హర్షాన్ని వెలిబుచ్చారు. ఇక ఏ ఉద్యోగం చేయాలన్నది ఆమె అభీష్టానికే వదిలేసినట్టు తల్లిదండ్రులు వెల్లడించారు.