Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గర్ల్ ఫ్రెండ్స్‌పై కేటీఆర్‌ ఏమన్నారు.. పవన్ కల్యాణ్ ఎనిగ్మా అట..

శుక్రవారం, 29 డిశెంబరు 2017 (11:48 IST)

Widgets Magazine
ktrao

తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండు గంటల పాటు ట్విట్టర్లో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు వేసిన ప్రశ్నలకు కేటీఆర్ ఓపిగ్గా బదులిచ్చారు. రాజకీయ, వ్యక్తిగత విషయాలపై పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

చేనేత అంబాసిడర్ సమంత అక్కినేని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి కూడా స్పందించారు. పవన్ కల్యాణ్ ఎనిగ్మా అని కేటీఆర్ అభివర్ణించారు. 
 
ఎనిగ్మా అంటే ఎవరికీ అర్థంకాని వ్యక్తి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. పవన్ రాజకీయ భవితవ్యం గురించి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ అది ప్రజలు నిర్ణయిస్తారని.. అది చెప్పడానికి తానెవరిని అని ఎదురు ప్రశ్న వేశారు. 
 
ఎన్టీఆర్‌ని పెర్ఫార్మర్ అని, మహేష్ బాబును స్క్రీన్ ప్రెజెన్స్‌లో సూపర్ స్టార్‌గా కేటీఆర్ అభివర్ణించారు. ప్రభాస్‌ను బాహుబలి అని చెప్పుకొచ్చారు.  మెట్రో రైలు చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఓ నెటిజన్ ప్రశ్నకు మిగతా మెట్రోలు, ఏసీ బస్సు టికెట్లతో సమానంగా ఉన్నాయని తెలిపారు.
 
మంత్రి కేటీఆర్‌కి యువ‌త‌లో మంచి ఫాలోయింగ్ వుండటంతో.. కేటీఆర్ లీడ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా నిలిచారు. గురువారం ట్విట్ట‌ర్‌లో #AskKTR పేరుతో నెటిజన్లతో సంభాషించిన కేటీఆర్ వ్యక్తిగత విషయాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నకు ఓపిగ్గా బదులిచ్చారు. 
 
ఈ క్రమంలో ఓ నెటిజ‌న్.. కాలేజీ రోజుల్లో మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అనే ప్రశ్నకు కేటీఆర్ తమాషాగా బదులిచ్చారు. వారి పేర్లు చెప్పాల‌ని కోరుకుంటున్నావా? అని జ‌వాబిచ్చారు.  సార్‌కి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ వుండి వుంటారు. అందుకే బహువచనం వాడారంటూ మరో నెటిజన్ చమత్కరించారు.

రాహుల్ ద్రావిడ్, కోహ్లీ, రోహిత్‌శర్మ తన అభిమాన క్రికెటర్లుగా తెలిపిన ఐటీ మంత్రి… షారుఖ్ ఖాన్ తమ అభిమాన బాలీవుడ్ నటుడున్నారు. కేసీఆర్ కాకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాను అధికంగా ఇష్టపడే నేత అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 15మంది సజీవదహనం

ముంబై నగరంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 15మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 12మంది మహిళలు ...

news

పెళ్లికి పెద్దలు అడ్డు.. కలిసి చనిపోదామంటే నో చెప్పింది.. చివరికి ఆ ప్రియుడు ఏం చేశాడంటే?

ప్రేయసి వివాహానికి నిరాకరించడంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. మతాలు వేరు కావడంతో ...

news

మతం మారనన్న హిందూ యువతిపై ఘోరం: గ్యాంగ్ రేప్, హత్య.. చెట్ల పొదల్లో పడేసి?

జార్ఖండ్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఇస్లాం మతం స్వీకరిచేందుకు ...

news

దినకరన్‌కు మద్దతు.. 46 మందిపై ఈపీఎస్ వేటు

ఆర్కే నగర్ ఎన్నికల్లో చిన్నమ్మ మేనల్లుడు దినకరన్‌కు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే నేతలపై ...

Widgets Magazine