శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 24 జులై 2014 (11:42 IST)

తెలంగాణ అనకూడదు.. ఇకపై తెలంగాణ రాష్ట్రం అనాలి!

తెలంగాణ పదం వాడకూడదని తెలంగాణ సర్కార్ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇకపై టీవీలలో వార్తలు చదివే సమయంలోగానీ, వార్తాపత్రికలలో రాసే సమయంలోగానీ తెలంగాణ రాష్ట్రం గురించి ప్రస్తావించాల్సినప్పుడు కేవలం ‘తెలంగాణ’ అని కాకుండా ‘తెలంగాణ రాష్ట్రం’ అని అనాలని ‘తెలంగాణ రాష్ట్రం’ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వెల్లడించారు.
 
ఈ విషయం మీద ‘తెలంగాణ రాష్ట్రం’లోని అన్ని పత్రికలు, టీవీ చానెళ్ల ఎడిటర్లకు రాజీవ్ శర్మ లేఖ రాశారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక రాష్ట్రాన్ని ‘తెలంగాణ’ అనే సంబోంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్రం’ అని పేర్కొనాలని రాజీవ్ శర్మ చెప్పుకొచ్చారు.