గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (13:09 IST)

విజయవాడ కోర్టుకు కాల్‌ డేటా.. అందులో ఏముందో.. కేసీఆర్ వెన్నులో వణుకు?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెలిఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కాల్ డేటా వివరాలను విజయవాడ కోర్టుకు సర్వీస్ ప్రొవైడర్లు షీల్డు కవర్‌లో ఉంచి సమర్పించారు. అయితే, ఈ కాల్ డేటాలో ఉండే సమాచారాన్ని మాత్రం బహిర్గతం చేసేందుకు సర్వీస్ ప్రొవైడర్లు ససేమిరా అంటున్నారు. అయితే, కాల్ డేటా కోర్టుకు చేరడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నులో వణుకు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. 
 
కాగా, విజయవాడ కోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించిన కాల్ డేటాలో ఏముందో తెలియజేస్తూ, నోట్ ఫైల్ ఇవ్వాలని ఏపీ సీఐడీ, సిట్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించగా, తాము సుప్రీంకోర్టు సూచనల మేరకు సీల్డ్ కవర్లో వివరాలు అందించామని, దానిలో ఏముందో చెప్పే సమస్యే లేదని సర్వీస్ ప్రొవైడర్ల తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. నోట్ ఫైల్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. 
 
కాగా, ఈ సీల్డ్ కవర్ కాల్ డేటా వివరాలను ప్రత్యేక దూత (మెసెంజర్) ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్ వద్దకు పంపాలని, గురువారం హైకోర్టు తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, ఏపీ ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికారుల ఫోన్లను ట్యాప్ చేశారని కేసులు నమోదైన విషయం తెల్సిందే.