బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (17:30 IST)

కేసీఆరూ.. పథకాల ప్రకటన మాని.. ఆర్థికవిధానమేమిటో చెప్పు!

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజా గాయకుడు గద్దర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ పథకాలు ప్రకటించడం మానేసి తన ఆర్థిక విధానమేంటో ప్రకటించాలని గద్దర్ డిమాండ్ చేశారు. వందలాది కేసులు పెట్టిన తెలంగాణ యువత పరిస్థితి ఏమిటని గద్దర్ ప్రశ్నించారు. 
 
ప్రజా పోరాటాల వల్ల మాత్రమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇక అభివృద్ధిని కూడా పోరాడి సాధించుకోవాలని గద్దర్ పిలుపునిచ్చారు.
 
మావోయిస్టుల ఎజెండా అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 25 శాతం అమలు చేసినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గద్దర్ వ్యాఖ్యానించారు.