Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాహనాలు తగలబడిపోతున్నాయ్ : 47 డిగ్రీల ఉష్ణోగ్రత... వాతావరణ శాఖ హెచ్చరిక

శుక్రవారం, 19 మే 2017 (15:13 IST)

Widgets Magazine
scooter burn

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. ఏపీలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరులో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక తణుకు, రాజమండ్రి, రెంటచింతలలో 45 డిగ్రీలు నమోదుకాగా... నల్గొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, ఒంగోలులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా ఎండలో పార్కింగ్ చేసిన వాహనాలు తగలబడిపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ద్విచక్రవాహనం రోడ్డులోనే నిలువునా తగలబడిపోయింది. 
 
దీనికికారణం ఒక్కసారిగా ఎండ‌ల తీవ్ర‌త మ‌రింత పెరిగిపోవడమేనని చెప్పారు. సాధార‌ణం కంటే 4 నుంచి 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వవుతున్నాయ‌ని, ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని సూచించారు. వాయవ్య భారత్‌ నుంచి వీస్తున్న వేడి గాలులు వేడిమిని మరింత పెరిగేలా చేస్తున్నాయ‌ని తెలిపారు. రాత్రిపూట కూడా వేడిగాల్పుల ప్ర‌భావం అధికంగా ఉంద‌ని తెలిపారు. 
 
ఇదిలావుండగా, కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో క్యూములో నింబస్‌ మేఘాల ప్ర‌భావంతో వ‌ర్షం కురుస్తోంది. ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు పడటంతో ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు కాస్త త‌గ్గాయి. అయితే, వాయవ్యం నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మిత్రుడిగా భావించిన రజనీకి కృతజ్ఞతలు.. బీజేపీ పట్ల జాగ్రత్త.. రజనీకి స్టాలిన్ సూచన

రాజకీయాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ...

news

పవిత్ర పర్వతంపై ఎక్కింది.. నగ్నంగా ఫోజిచ్చింది.. వివాదంలో చిక్కిన కివీస్ మోడల్..

న్యూజిలాండ్‌లోని తరానకి పర్వతాన్ని మౌరి తెగకి చెందిన ప్రజలు పవిత్ర ప్రాంతంగా భావిస్తారు. ...

news

నీ బాయ్‌ఫ్రెండ్‌ను నాకిస్తే రూ.కోటిన్నర ఇస్తా... ఓ సంపన్న కుటుంబ మహిళ ఆఫర్

గతంలో జగపతి బాబు, ఆమని హీరోహీరోయిన్లుగా, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ...

news

పటాస్, జబర్దస్త్ మండుతున్నాయి... రామోజీరావు ఇంత దిగజారాల్సిన అవసరం వుందా...?

రామోజీరావు అనగానే మీడియా మొఘల్ అని చటుక్కున చెప్పేస్తారు. మీడియాలో ఆయన ఓ సంచలనం. తెలుగు ...

Widgets Magazine