Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుమలపై ఉగ్రవాదులు కన్నేశారా..! ఇంటిలిజెన్స్‌కు సంకేతాలు..?

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (15:34 IST)

Widgets Magazine
tirumala security

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ప్రతిరోజు 50వేల మందికిపైగా భక్తులు తిరుమలకు వస్తూ పోతూ ఉంటారు. అయితే పోలీసులు మాత్రం ఎప్పుడూ ఈ క్షేత్రంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ విధులు నిర్వహించే పోలీసులు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. ఒక్క పోలీసులే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులు ఇదే తంతు. ఎవరి వ్యాపారం వారిది. అందరూ అని చెప్పడం లేదు. 100లో ఎంతోమంది. అలా తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే కాదు ఉగ్రవాదులకు దారి వదులుతున్నారు వీరు.
 
గత కొన్నినెలలుగా ఉగ్రవాదుల కదలికలు తిరుమలలో ఉన్నాయని కేంద్ర ఇంటిలిజెన్స్‌కు సంకేతాలు వచ్చాయి. ఈ సంకేతాలతో మరింత అప్రమత్తమయ్యారు. కానీ పోలీసులు మాత్రం ఎప్పటిలాగే అలాగే ఉన్నారు తప్ప వారిలో ఎలాంటి మార్పు లేదు. అందుకే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇదంతా జరుగుతుందనడానికి తాజాగా జరిగిన ఒక ఘటనే ఉదాహరణ. బంగ్లాదేశ్‌‌కు చెందిన అబూ అజ్మీ అనే వ్యక్తి ఏకంగా తిరుమలకు వచ్చి ప్రార్థనలు చేయడం కలకలం రేపింది. అంతేకాదు అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరిపితే అసలు విషయం బయటపడింది.
 
పట్టుబడిన వ్యక్తికి ఏమీ తెలియదని ముందుగా పోలీసులు అనుకున్నారు. కానీ విచారించిన తర్వాత గానీ అసలు విషయం తెలియలేదు. అతను ఉగ్రవాది అని. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రముఖ హిందూ దేవాలయాలను తిరిగిన ఈ అబూ ఆ తర్వాత తిరుమలకు వచ్చాడు. ఒక ముస్లిం.. అందులోను పెద్ద పెద్ద మీసాలు, గడ్డాలతో వచ్చిన వ్యక్తిని తిరుమలకు పంపడం మొదటి తప్పు. పంపినా ఆ తర్వాత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత పోలీసులది. ఎంచక్కా తిరుమలకు వచ్చిన అజ్మీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
 
ప్రస్తుతం అజ్మీ రిమాండ్‌లో ఉన్నా అతని వెనుక ఉన్న వారి కోసం లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇతని వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఉగ్రవాది ఇలా రావడం మాత్రం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఉగ్రవాదుల కదలికలు తిరుమలలో ఉందనడానికి దీనికి మించిన ఉదాహరణ లేదంటున్నారు భక్తులు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చంద్రబాబుకు మృత్యుభయం.. హెలికాప్టర్ ఎందుకు ఎక్కరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలిపోయిన తర్వాత ఏపీకి ఆర్థిక లోటు ఉందని అధికారంలోకి ...

news

టపాసుల మోత మోగుతుందనుకుంటే.. తడిసిన తారాజువ్వలా తుస్సుమంది: రాహుల్

కేంద్ర బడ్జెట్ 2017పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. బడ్జెట్‌లో తాము ...

news

జైట్లీ నోట గాంధీ మాట.. నిర్ణయం సరైనదైతే.. అది ఎన్నటికీ విఫలం కాదు.. బడ్జెట్ హైలైట్స్

కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ...

news

పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగాయ్.. తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు

పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ...

Widgets Magazine