గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (20:03 IST)

తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణం ప్రమాదమే: నిపుణుల వెల్లడి

తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పదేళ్ల వరకూ ఇబ్బంది లేకపోయినా తరువాత మాత్రం ప్రమాదం తీవ్రత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డును ఐఐటీ నిపుణులు పరిశీలించారు.తాజాగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనతో టీటీడీ అధికారులు, నిపుణులు ఇవాళ సందర్శించి ప్రమాదలు నివారణకు తీసుకున్న చర్యలపై నివేదక రూపొందించారు. చెన్నై ఐఐటీ కి సంబంధించిన సీనియార్ ప్రోఫసర్ నరసింహరావు అధ్వర్యంలో బృందం ఘాట్ రోడ్డులో వివిధప్రాంతాలను క్షుణంగా పరిశీలించారు.
 
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే  ఘాట్ రోడ్డులలో ప్రయాణాలు ప్రమాదంగా మారుతుండడంపై భక్తులు అందోళనలు చెందుతున్నారు. ఘాట్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఎత్తైన కొండలు ప్రమాదకరంగా మారుతున్నాయని నిపుణులు గ్రహించారు. ఇప్పటికే ఎన్నోసార్లు నిఫుణుల అభిప్రాయలు తీసుకున్నప్పటికి శాశ్వత చర్యలు చేపట్టేందుకు టీటీడీ అడుగులు వేస్తొంది.
 
ఇందులో భాగంగా ఇవాళ టీటీడీ ఇంజనీరింగ్ విభాగం, నిపుణుల బృందం సంయుక్తంగా తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించింది. భారీ బండరాళ్లు, మట్టిపెళ్లలు, కొండచరియలతో పాటు అతిసున్నిత ప్రాంతాలను గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా తీసుకొవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టింది.
 
ప్రమాదాలను పునరావృతం కాకుండా పరిష్కారానికి చిన్న సైజు కొండలకు అనుకొని ప్రహరీ గోడలను నిర్మించడంతో పాటు భారీ బండరాళ్లుతో కూడిన ఎత్తైన కొండలను బ్లాస్ట్ చేసి బండరాళ్లను తొలిగస్తే ప్రమాదాలకు తావు ఉండదని వారు సూచించారు. దీంతో పాటు నూనుపైన కొండల మధ్య మొలిచిన మొక్కలను తొలగించాలని సూచించారు.వీలైనంత త్వరగా టీటీడ ఇంజనీరింగ్ అధికారులకు నిపుణులు అందజేసిన సూచనలు పాటిస్తే  దాదాపుగా ప్రమాదాలు నివారించవచ్చని ప్రోఫసర్ నరసింహరావు తెలిపారు.