Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుపతిలో అమ్మాయిలు ఎంత చురుగ్గా ఉన్నారో చూడండి..

ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (14:27 IST)

Widgets Magazine

పరిశుభ్రతే ప్రధానమంటూ యువకులందరూ కదం తొక్కారు. చేయి చేయి కలిపి స్వచ్ఛతను చేకూర్చడంతో పాటు అడుగులో అడుగేస్తూ పరిశుభ్రత వైపు పయనమయవుతున్నారు. స్వచ్ఛ భారత్ కలను సాకారం చేయడంలో భాగంగా స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని తిరుపతి నగర పాలక సంస్థ అధికారులు ఘనంగా నిర్వహించారు.
tirupati girl
 
పరిశుభ్రతే అన్నింటికి ప్రధానమని దానిని అలవరుచుకోవడం కోసం అందరిలో అవగాహన కల్పించాలని కోరారు. స్వచ్ఛత కోసం ఒక్కటడుగు అంటూ నినదిస్తూ ముందుకు కదిలారు. పరిశుభ్రతను ఏ విధంగా పాటించాలో తెలియజేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిర్వహించిన హాఫ్‌ మారథాన్ అందరినీ ఆకట్టుకుంది.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో స్వచ్ఛ భారత్‌కు ఏ విధంగా అయితే స్పందన లభించిందో అలాంటి కార్యక్రమాన్నే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. స్వచ్ఛతే సేవ పేరుతో మన నగరాన్ని మనం స్వచ్ఛంగా ఉంచాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో తిరుపతి నగర పాలక సంస్థ హాఫ్‌ మారథాన్ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించింది. 
 
తారకరామ స్టేడియంలో జరిగిన హాఫ్‌ మారథాన్‍‌‌లో 7 వేల మందికి పైగా యువతీ, యువకులు ఉల్లాసంగా ఉత్సాహంగా మారథాన్‌లో పాల్గొన్నారు. స్వచ్ఛత కోసం అడుగు వేయడమేకాకుండా ఆరోగ్యం కోసం కూడా నడవాలంటూ యువతీయువకులు పిలుపునిచ్చారు.
 
21కె, 10కె, 5కె రన్‌లు నిర్వహించారు. చిరుజల్లులు పడుతున్నా లెక్క చెయ్యకుండా మారథాన్‌‌లో పాల్గొన్నారు. మారథాన్‌లో పాల్గొనే వారిని ఉత్సాహపరుస్తూ పలు సినిమాల్లోని పాటలకు డ్యాన్సులు వేశారు. 
 
చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, నగర పాలక సంస్థ కమిషనర్ హరికిరణ్‌, ఎస్పీ మహంతి, ఎంపీ వరప్రసాద్‌లు మారథాన్‌లో పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు హాఫ్ మారథాన్ జరిగింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'నేనొక ఎంపీని.. టోల్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు' : బీజేపీ ఎంపీ

‘నేనొక ఎంపీని. టోల్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం నాకు లేదు. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా?’ ఉత్తర ...

news

#HappyBirthdayPM : సర్దార్ సరోవర్ డ్యామ్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని

ఐదు దశాబ్దాల కల నేటికి సాకారమైంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు గుజరాత్‌లో ...

news

'స్వచ్ఛతా హీ సేవా'కు సాయం చేయండి.. మోహన్‌లాల్‌కు ప్రధాని లేఖ

ఆయన దేశ ప్రధానమంత్రి. మరొకరు మలయాళ సూపర్ స్టార్. వారిద్దరు ఎవరో కాదు నరేంద్ర మోడీ. మరొకరు ...

news

మాయమాటలతో రూ.4.88 లక్షలు... మహిళ చేతిలో మోసపోయిన డాక్టర్

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ కిలేడీ చేతిలో ఓ డాక్టర్ మోసపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ...

Widgets Magazine