బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2016 (11:28 IST)

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కోదండరాం దీక్ష .. ఎందుకోసం?

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పక్కనబెట్టారు. ఆ తర్వాత అపుడపుడు కేసీఆర్ సర్కారు పనిత

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పక్కనబెట్టారు. ఆ తర్వాత అపుడపుడు కేసీఆర్ సర్కారు పనితీరును కోదండరాం తప్పుబడుతూ వస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జేఏసీ చైర్మన్ కోదండరామ్ తొలిసారిగా దీక్షను చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల సమస్యలను పక్కన పెట్టిందని ఆరోపిస్తూ, ఆదివారం 10 గంటలకు లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలోని ఇందిరా పార్కు వద్ద 'రైతు దీక్ష' చేపట్టారు. 
 
ఆయనతో పాటు పలు రైతు సంఘాల నాయకులు, జేఏసీ నేతలు పాల్గొనడం, పెద్ద ఎత్తున పోలీసులను ఈ ప్రాంతంలో మోహరించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగే ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.