Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమీర్‌పేట్ కేసులో మాజీ గవర్నర్‌కు తప్పని చిక్కులు

గురువారం, 9 నవంబరు 2017 (09:03 IST)

Widgets Magazine
rosaiah

హైదరాబాద్‌లోని అమీర్‌పేట భూ బదలాయింపు కేసులో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు చిక్కులు తప్పేలాలేవు. ఆయన పాత్రపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవిగా పరిగణించిన సుప్రీంకోర్టు… కేసు విచారణను ఆరు నెలలకు వాయిదా వేసింది. 
 
ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే 2009-10 మధ్యకాలంలో ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలో 9.5 ఎకరాల భూమిని డీనోటిఫై చేస్తూ సంతకం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రోశయ్యకు వ్యతిరేకంగా పిటిషనర్‌ కె.మోహన్‌లాల్‌ గతంలో ఏసీబీకోర్టును ఆశ్రయించారు. 
 
ఏసీబీ కోర్టులో విచారణను సవాల్‌ చేస్తూ రోశయ్య హైకోర్టు తలుపుతట్టారు. రోశయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా కేసు కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ 2016లో సుప్రీంను ఆశ్రయించారు. అయితే, గతంలో పలుమార్లు ఈ కేసు విచారణ జరిగినప్పటికీ.. రోశయ్య ఆ సమయంలో తమిళనాడు గవర్నర్‌గా ఉండటంతో కోర్టు నోటీసులు పంపలేదు. 
 
ఈ క్రమంలో తాజాగా ఈ కేసు బుధవారం జస్టిస్‌ రంజన్‌ గొగోరు, జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌, జస్టిస్‌ నవీన్‌ సిన్హాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఆరోపణలు తీవ్రమైనవిగా పరిగణించిన ధర్మాసనం.. కేసు విచారణను ఆరు నెలల పాటు వాయిదా వేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

లాడ్జిలో ఉరివేసుకున్న నిట్ విద్యార్థి.. ఎందుకంటే...

ఎన్.ఐ.టిలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ ...

news

#himachalpradeshelections: బ్యాలెట్ సమరం .. పోలింగ్‌ షురూ

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ...

news

ఔను... పేపర్లో చూశా... సభకు జగన్ వస్తే బావుంటుంది... స్పీకర్ కోడెల

అమరావతి: శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, వివరాలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ...

news

అలా చేస్తే వారు హర్ట్ అవుతారు... జాగ్రత్తగా చూస్కోవాలి... స్పీకర్ డాక్టర్ కోడెల

అమరావతి: ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు ...

Widgets Magazine