బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (09:11 IST)

టుడే...నో పెట్రోల్... డీలర్ల ఆందోళన

నేడు రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ డీజల్ లభించే పరిస్థితి లేదు. డీలర్లు సమ్మె చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఇంధన విక్రయాలను నిలిపేసిన డీలర్లు, తమ డిమాండ్లను నెరవేర్చేదాకా బంకులను తెరిచేది లేదంటూ తేల్చిచెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని పెట్రోల్ బంకుల యజమానులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. 
 
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో కేంద్రం పెట్రోల్ ధరలను తగ్గిస్తే, ఏపీ సర్కారు వ్యాట్ పేరిట ధరలను పెంచిందని డీలర్లు ఆరోపిస్తున్నారు. తక్షణమే వ్యాట్ ను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డీలర్లు ఆందోళనకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.