Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మేకవన్నె పులి.. నేనూ గిరిజనుడ్నే అంటూ ఇంట్లోకి పిలిచి...

సోమవారం, 9 అక్టోబరు 2017 (08:51 IST)

Widgets Magazine

హైదరాబాద్‌లో ఓ మేకవెన్నెపులిలా ఉన్న ఓ మృగాడి నిజస్వరూపం వెలుగుచూసింది. నేనూ గిరిజనుడ్నే.. వర్షంలో తడవద్దు ఇంట్లోకి రండి అని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తిన విషయం తెల్సిందే. వికారాబాద్‌ జిల్లాకు చెందిన మహిళ (48) రాజేంద్రనగర్‌ ఉప్పర్‌ పల్లిలో నివాసం ఉండే తమ కుమారుల వద్దకు వచ్చింది. ఈ క్రమంలో తమకు తెలిసిన వారివద్దకు వెళ్లి వస్తున్న సమయంలో వర్షం ఒక్కసారిగా జోరందుకుంది. దీంతో వర్షంలో తడవకుండా ఉండేందుకు ఒక ఇంటి పక్కన నిల్చుంది.
 
అయితే వర్షం ఆగకపోవడంతో సరైన చోటుకాకపోవడంతో ఆమె తడుస్తూనే ఉంది. దీంతో ఆమె నిల్చున్న ఇంట్లోంచి బయటకు వచ్చిన రాజు నాయక్ (23) అనే యువకుడు ఆమెను గిరజన మహిళగా గుర్తించి, తాను కూడా గిరిజనుడ్నేనని చెబుతూ, వారి భాషలోనే మాట్లాడి, వర్షం తగ్గేవరకూ ఇంట్లో ఉండి వెళ్లాలని నమ్మించాడు. 
 
పైగా, గిరిజన భాషలో మాట్లాడటంతో ఆమె నిజంగానే నమ్మి ఇంట్లోకి వెళ్లింది. ఆమెపై కన్నేసిన మేకవన్నెపులి కాసేపటి తన నిజస్వరూపం బయటపెట్టాడు. తర్వాత తలుపులు మూసి, విద్యుత్ సరఫరా నిలిపేసి, ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’.. అమిత్ షా తొత్తులు: వైశ్య నేతలపై ఐలయ్య

ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులపై వివాదాస్పద రచయిత, మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య మరోమారు మాటలతో ...

news

జమిలి ఎన్నికలకు సిద్ధం.. చెప్పడమే తరువాయి : ఈసీ

'వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌' అనే నినాదంలో భాగంగా, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ...

news

అంతా భోళాశంకరుడి ఆశీస్సులే : ప్రధాని నరేంద్ర మోడీ

తనకు భోళాశంకరుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్‌ ...

news

విదర్భలో 20 మంది రైతులు మృతి.. కంటిచూపు కూడా కోల్పోయారు..

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 20 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. పత్తి చేలకు ...

Widgets Magazine