శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (19:17 IST)

చంద్రబాబు కీ ఇస్తే రేవంత్ రెడ్డి బొమ్మలా ఆడుతున్నారు!

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి తమ జిల్లాలో చెడబుట్టి, జిల్లా పరువును తీస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి లాంటివాళ్లు శాసనసభకే కళంకమని మండిపడ్డారు. 
 
రేవంత్ రెడ్డి తెలంగాణ ఓబులేసు అని కూడా జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీ ఇస్తే రేవంత్ రెడ్డి బొమ్మలా ఆడుతున్నారని విమర్శించారు. అవినీతిని చట్టబద్ధం చేసిన చరిత్ర చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు.