శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (15:10 IST)

పోలవరంతో పెను ప్రమాదం: కవిత, కేసీఆర్ రివ్యూ

గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదం సంభవిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్రం ఏరాష్ట్రాన్ని సంప్రదించకుండా పోలవరంపై ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం జరగలేదన్నారు. 
 
ప్రాజెక్టుకు ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడం సరికాదని ఎంపీ కవిత సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం జరగలేదని కవిత తెలిపారు. రాష్ట్ర హోంశాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గురువారం హైదరాబాదులోని సచివాలయంలో సమావేశమయ్యారు. పోలీస్ లోగో, యూనిఫామ్, కొత్త వాహనాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
 
హైదరాబాద్ నగర పరిధిలో పోలీసు శాఖలో మార్పులు చేర్పులపై హోంశాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రదర్శించారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న పోలీసు శాఖలో పలు సంస్కరణలకు కెసిఆర్ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కొత్త వాహనాల కొనుగోలుకు నిధులు కూడా విడుదల చేశారు. 15 రోజుల్లో కొత్త వాహనాలను కెసిఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.