శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2014 (08:37 IST)

నందిగామలో టీడీపీ జయభేరి : మెదక్‌లో టీఆర్ఎస్ విజయఢంకా!

కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం భారీ మెజార్టీ సాధించి రికార్డు సృష్టించింది. రెండోదఫా ఎన్నికై ప్రమాణ స్వీకారానికి ముందే తెదేపా అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ప్రభాకర రావు కుమార్తె సౌమ్య రికార్డుస్థాయిలో విజయం సాధించారు. కృష్ణాజిల్లాలో వేర్వేరు కారణాలతో ఇప్పటివరకు జరిగిన 16 ఉప ఎన్నికల్లో సౌమ్య సాధించిన మెజార్టీదే రికార్డు.
 
తెదేపా సీనియర్ నేత, అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య అకాల మరణంతో గత ఏడాది జరిగిన ఉప ఎన్నికలో బ్రాహ్మణయ్య తనయుడు శ్రీహరిప్రసాద్ 61.644 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నందిగామ ఉప ఎన్నికలో సౌమ్య 74.827 వేల ఓట్ల ఆధిక్యతతో ఆ రికార్డును అధిగమించారు. ఈ ఉప ఎన్నికలో వైకాపా పోటీ నుంచి వైదొలిగింది. 
 
తెదేపా ఘన విజయంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రబాబు 100 రోజుల పాలనకు ఈ తీర్పు అద్దం పట్టగలదని మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వంపై ఎన్ని దుష్ప్రచారాలు సాగించినా ప్రజలు విశ్వసించలేదన్నారు.