శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ESHWAR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (13:09 IST)

కనుమూరి బాపిరాజుకు నైతిక బాధ్యత లేదా...?

టీడీడీ ఛైర్మైన్‌గా నియమించిన ప్రభుత్వం అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోనూ అడ్రస్ లేకుండా పోయింది. నైతిక విలువలు పాటిస్తూ పదవికి రాజీనామా చెయ్యవలసిన కనుమూరి బాపిరాజు మాత్రం రాజీ డ్రామాలు ఆడేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పదవికి రాజీనామా చెయ్యకూండా.... టిటిడి పాలక మండల వ్యవహారాలుకు దూరంగా వుంటున్నారు బాపిరాజు. 
 
ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ ఉంటుంది. కేంద్ర మంత్రి పదవులును సహితం కాదనుకుని ఈ పదవి కోసం నాయకులు పోరాడుతూ ఉంటారు. అలాంటిది టీటీడీ చరిత్రలోనే ఎవరికి లేని అవకాశం బాపిరాజుకు లభించింది. ప్రస్తుతం ముడోవసారి పదవిని అనుభవిస్తున్న బాపిరాజుకు ఆ పదవిని వదిలి రాలేకపోతున్నారు. నైతిక విలువలు గురించి ఎప్పుడు లెక్చర్‌లు ఇచ్చే బాపిరాజు పదవికి రాజీనామా చెయ్యవలసి వుండగా.. ఇప్పటివరకు రాజీనామా చెయ్యలేదు. 
 
పాలకమండలికి రాజీనామా చేయ్యాలంటూ ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రి అల్టిమేటం జారీ చేసినా రాజుగారి వైపు నుండి ఎలాంటి స్పందన లేదు. పోని పదవిలో ఉన్నారు కదా.... స్వామివారి భక్తుల కష్టాలపై ఏమన్నా దృష్టి సారించారా అంటే అదీలేదు. అసలు ఏ కార్యక్రమం నిర్వహించిన తగదునమ్మా అంటూ ముందుగా వుండే బాపిరాజు గత 45 రోజులుగా తిరుమల కొండ ఎక్కింది లేదు. రోండు నెలలుగా పాలకమండలి సమావేశమైంది లేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనూ, రాష్ట్రపతి పాలనలోనూ సమావేశాలు నిర్వహించేసిన బాపిరాజు గత రోండు నెలలుగా సమావేశాలు నిర్వహించకుండా టిటిడి పాలనను గాడితప్పేలా చేస్తున్నారన్నా విమర్శలుకు చోటు ఇస్తూన్నారు. 
 
మరోవైపు నూతన పాలకమండలిని నియమించడంలోను ప్రస్తుత ప్రభుత్వం చొరవ చూపకపోవడం తెలుగు తమ్ముళ్ళును ఆవేదనకు గురిచేస్తుంది. అధికారంలో లేనప్పుడు సరే ... అధికారంలోకి వచ్చినా తమ ప్రత్యర్థులే పదవిలో కోనసాగుతుండడం పై తెలుగు తమ్ముళ్ళు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఇప్పటికే పాలకమండలి ఛైర్మైన్‌గా తిరుపతికి చెందిన మాజీ శాసన సభ్యుడు చదలవాడను నియమిస్తారంటూ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సమయంలో బహిరంగంగానే ప్రకటించి ఉండడంతో, పదవి పై ఆశల పల్లకిలో వున్న చదలవాడకు బాపిరాజు వ్యవహారశైలి మింగుడు పడడంలేదు. మరి బాపిరాజు ఎవరేమనకుంటే నాకేంటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరించి ఆగష్టు 30వ తేదీ వరకు పదవిలో వుంటారో లేక ఇప్పటికైనా రాజీనామా చేసి కాసింత పరువైనా దక్కించుకుంటారో అన్నది వేచి చూడాల్సిందే. 
 
అయితే నరసాపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు స్వయానా బాపిరాజుకు బావ వరుస. బావ ద్వారా చంద్రబాబును తన పదవీకాలం ముగిసే వరకూ పదివిలో కొనసాగించమని వర్తమానం పంపిచారట బాపిరాజు.. ఆగస్టులో పదవీకాలం ముగుస్తుంది గనుక అప్పటి వరకూ తన జోలికి రావద్దని బాపిరాజు చంద్రబాబుని కోరారాట. అయితే ఇక్కడ కొసమెరపు ఏంటంటే టిటిడి పదవికి తక్షణమే బాపిరాజు రాజీనామా చేయాల్న అన్న రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు  బీజేపీ పార్టీ సభ్యుడు. బాపిరాజు పదవికాలం ముగిసే వరకూ పదివిలో కొనసాగేలా పైరవీ చేసింది బీజేపీ పార్టీ సభ్యుడే. ఈ విషయం తెలిసిన రాజకీయ నాయకులు వారేవ్వా ‘ఏం కమలం రాజకీయం’రా బాబూ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.