మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (14:31 IST)

న్యాయవాది హత్య కేసు మిస్టరీ వీడింది.. భూతగాదాల వల్లే లేపేశాం.. నిందితుడు లోకేష్

కీసర వద్ద న్యాయవాది ఉదయ్‌కుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం సజీవదహనం చేశారు. న్యాయవాది ఉదయ్ కుమార్ సజీవ దహనం కేసును పోలీసులు అన్నికోణాల్లో విచారించి అసలు నిందితుడిని పట్టుకున్నారు. న్యాయవాదిని

కీసర వద్ద న్యాయవాది ఉదయ్‌కుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం సజీవదహనం చేశారు. న్యాయవాది ఉదయ్ కుమార్ సజీవ దహనం కేసును పోలీసులు అన్నికోణాల్లో విచారించి అసలు నిందితుడిని పట్టుకున్నారు. న్యాయవాదిని హత్య చేసింది.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన లోకేష్‌గా తేలింది. భూతగాదాల కారణంగా ఈ హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. ఏఎస్ రావునగర్‌లోని శ్రీనివాస్‌నగర్ కాలనీ ప్రాంతానికి చెందిన ఆవుల తిరుమల ఉదయ్‌కుమార్ (39) మల్కాజ్‌గిరి కోర్టులో జూనియర్ అడ్వకేట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన భర్త ఆదివారం ఉదయం వరకు రాకపోయేసరికి జగదీశ్వరీ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కీసరదాయర ప్రాంతంలో మారుతి కారు (ఏపీ 29 ఎల్ 4850)లో మంటలు వచ్చి పూర్తిగా దగ్ధమైందని ఆదివారం ఉదయం కీసర పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారును పరిశీలించగా అందులో పూర్తిగా కాలిపోయిన మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.
 
గతంలో కీసరలోని 5 ఎకరాల భూమిని ఉదయ్ కుమార్ గతంలో లోకేష్‌కు విక్రయించారు. ఆ తర్వాత ఆ భూమి తమకు కావాలని, డబ్బు తిరిగి చెల్లిస్తామని లోకేస్‌కు చెప్పాడు. అయితే లోకేష్ ససేమిరా కుదరదని తేల్చిచెప్పేశాడు. ఈ విషయంగా ఉదయ్ కుమార్ అతనిపై తీవ్రంగా ఒత్తిడి చేశాడు. దీంతో కోపాద్రిక్తుడైన లోకేష్... ఉదయ్ కుమార్‌ను కర్రతో కొట్టి ఆ తర్వాత కారులో బంధించి సజీవ దహనం చేశాడు. పోలీసులు విచారణలో లోకేష్ చేసిన నేరాన్ని అంగీకరించాడు. లోకేష్‌కు సహకరించిన అతడి స్నేహితుడిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు.