గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (17:33 IST)

జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఉండవల్లి.. పోలవరంపై కేంద్రానికి అలుసెందుకో?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వైకాపా ప్రతినిధులు హాజరుకాకపోవడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుబట్టారు. అసెంబ్లీని బహిష్కరించడాన్ని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సరికాదన్నారు. అసెంబ్లీని బహ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వైకాపా ప్రతినిధులు హాజరుకాకపోవడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుబట్టారు. అసెంబ్లీని బహిష్కరించడాన్ని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సరికాదన్నారు. అసెంబ్లీని బహిష్కరించాలన్న నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని ఉండవల్లి వ్యాఖ్యానించారు. 
 
రాజమండ్రిలో ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ.. చట్టంలో లేదనే కారణం చూపుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తెలిపిందన్నారు. మరి అదే చట్టంలో ఉన్న పోలవరంపై కేంద్రం ఎందుకు అలసత్వం చూపుతోందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోతే, చంద్రబాబు ఎంత ప్రచారం చేసుకున్నా వృధానే అని వెల్లడించారు.
 
కాగా పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షం అసెంబ్లీకి దూరం కావడం సబబు కాదన్నారు.  వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంపైనే వుందని తెలిపారు. అంతేగాకుండా జగన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఉండవల్లి ఆకాంక్షించారు.