Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేడు అరుణ్ జైట్లీ పద్దుల చిట్టా వెల్లడి... ఏపీపై వరాల వర్షం కురిపించేనా?

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (08:32 IST)

Widgets Magazine
ap map

కేంద్ర ఆర్థిక మంత్రి 2017-18 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో నవ్యాంధ్రపై వరాల జల్లు కురిసే అవకాశం కనిపిస్తోంది. రాజధాని ‘అమరావతి’ కోసం భూములిచ్చిన రైతులతో మొదలుకుని... విభజన తర్వాత వచ్చిన విద్యాసంస్థలకు నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాల వరకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పలు శుభ వార్తలు వినిపిస్తారని అధికార టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
ముఖ్యంగా రాజధాని కోసం భూ సమీకరణ విధానంలో తమ పంట భూములను ఇచ్చిన రైతులకు కేంద్రం తీపి కబురు అందించబోతోంది. రాజధాని రైతులు తమ వాటాగా పొందే వాణిజ్య, నివాస ప్లాట్లను తొలిసారి విక్రయించగా వచ్చే సొమ్ముపై పన్ను (క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌) తొలగింపుపై సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
 
బడ్జెట్‌లో ఏపీకి తగిన విధంగా కేటాయింపులు చేయాలని జైట్లీని కేంద్ర మంత్రి సుజనా చౌదరి కలుసుకుని విన్నవించారు. ఆ సందర్భంగా జైట్లీ స్పందిస్తూ... బడ్జెట్‌లో నవ్యాంధ్రకు చాలా వరాలున్నాయని, ముందే చెబితే పత్రికలు లీక్‌ చేస్తారంటూ నవ్వుతూ తన కార్యాలయంనుంచి పంపారు. బడ్జెట్‌లో ఏపీకి పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏపీకి కేటాయించిన జాతీయస్థాయి విద్యా సంస్థలకు భారీగానే నిధులను కేటాయించే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

రాత్రి షిప్టుల్లో బలవంతంగా పనిచేయిస్తున్నారు.: ఇన్ఫోసిస్‌పై మహిళా టెక్కీల ధ్వజం

రెండు రోజుల క్రితం పుణేలోని ఇన్పోసిస్ ఆఫీసులో రసిలా రాజు అనే మహిళా ఉద్యోగినిని ఆఫీసు ...

news

'గే' లను కూడా మార్చేస్తారా బాబా గారూ, మీవల్ల కాదులెండి అంటున్న హిజ్రా

మార్కెట్‌లోకి కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చే ప్రతి కంపెనీ చేసేది ప్రజలను తిమ్మిని బమ్మిని ...

news

మహారాణి నుంచి మహాజనుల వరకు అందరి ద్వేషాన్ని చూరగొంటున్న మహానేత ట్రంప్

ముస్లి దేశాల పౌరులకు ప్రవేశ నిషేధం అంటూ కఠినాతికఠినమైన ఆంక్షలు పెట్టి లక్షలాదిమందిని ...

news

తాగితే తాగండి బాబూ.. కానీ మా పరువు తీయొద్దు: మొత్తుకుంటున్న మంత్రి నాయని

ఒక వైపేమో మద్యశాఖ ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని పోగొట్టుకోకూడదు. మరోవైపేమో తాగుబోతులు ...

Widgets Magazine