శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (16:18 IST)

గొడ్డు మాంసంపై నఖ్వీ వ్యాఖ్యలను ఖండించిన అసదుద్దీన్ ఓవైసీ

గొడ్డు మాంసం తినాలనుకుంటే పాకిస్థాన్ వెళ్లిపోవాలంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేసిన సంచలన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం ఓ టీవీ చానెల్ చర్చావేదికలో మాట్లాడుతూ పశు వధ, పశుమాంస విక్రయంపై నిషేధం విధించడం సరైనదేనని అన్నారు. ఈ వ్యవహారం లాభనష్టాల విషయం కాదని, నమ్మకాలకు సంబంధించిన అంశమన్నారు. హిందువులకు అది అత్యంత సున్నితమైన అంశమని ఆయన తెలిపారు.
 
లేదు గొడ్డు మాంసం తినాల్సిందే అని ఎవరైనా భావిస్తే, వారు పాకిస్థాన్, అరబ్, అది లభించే ఇతర దేశాలకు వెళ్లాలని ఆయన సూచించారు. ముస్లింలు కూడా పశుమాంస భక్షణ వ్యతిరేకిస్తారన్నారు. ఆయన వ్యాఖ్యలను అదే చర్చలో ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దానిపై నిషేధం విధిస్తుందా? అని ప్రశ్నించారు.