Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మిస్టర్ జైట్లీ... మీరూ.. మీ సర్కారు శాశ్వతం కాదు : సుజనా చౌదరి ఫైర్

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (08:53 IST)

Widgets Magazine
sujana chowdary

భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకునే దిశగానే అధికార టీడీపీకి చెందిన ఎంపీలు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇందులోభాగంగా, బీజేపీ నేతలను టీడీపీ ఎంపీలు కడిగిపారేస్తున్నారు. ముఖ్యంగా, పార్లమెంట్ ఆవరణలో తమను పలుకరించిన బీజేపీ నేతలందరినీ ఏకిపారేస్తున్నారు. ఇందులో చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా దులిపేస్తున్నారు. 
 
ముఖ్యంగా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై టీడీపీకి చెందిన మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తంచేశారు. మిస్టర్ జైట్లీ.. మీరూ.. మీ సర్కారు శాశ్వతం కాదంటూ హెచ్చరికలు చేశారు. అదీ కూడా ఒక్కసారి కాదు.. ఏకంగా రెండుసార్లు జైట్లీతో సుజనా చౌదరి వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. 
 
గత నాలుగు రోజులుగా పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సుజనా చౌదరితో అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, 'నేను రెండు సార్లు ప్రకటన చేశాను కదా.. ఇంకా సంతృప్తి చెందలేదా? ఎందుకు నిరసన తెలుపుతున్నారు' అంటూ ప్రశ్నించారు. 
 
దీనికి సుజనా కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు. 'ఆ ప్రకటనలో ఏముంది? దాని వల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చేదేమీ లేదు. మభ్యపెట్టేదిగా ఉంది. మా ముఖ్యమంత్రి సంతృప్తి చెందలేదు. మీరు నంబర్లను కాదు మెంబర్లను గౌరవించాలి.. మీ ప్రభుత్వం శాశ్వతం కాదు.. అధికారం శాశ్వతం కాదు.. ఏపీలో ప్రజలు రగిలిపోతున్నారు.. మా ఆందోళన విరమించేది లేదు' అంటూ తేల్చి చెప్పారు. దీనికి జైట్లీ కూడా.. సరే మీయిష్టం.. ఆందోళనలు చేసుకోండంటూ ముక్తసరిగా చెప్పి వెళ్లిపోయారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీజేపీకి ఏపీ ప్రజలు సమాధి కడుతారు : సీఎం రమేష్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటామంటూ నాలుగేళ్లపాటు ఊరించి ఊరించి చివరకు ఊసురుమనిపించిన ...

news

పచ్చని పొలం గట్టు ప్రక్కన కోటు వేసుకుని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

IRRI వారి ప్రాంతీయ వినూత్న ఆవిష్కరణ కేంద్ర స్థాపన.. .(IRRI–REGIONAL INNOVATIVE CENTRE): ...

news

టీడీపీ ఎంపీలకు అండగా నిలిచిన సోనియా గాంధీ

అధికారంలో ఉన్నసమయంలో తాము చేసిన తప్పును కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...

news

పార్లమెంటులో కె. కవిత 'జై ఆంధ్ర'... పవన్ కళ్యాణ్ 'తెలంగాణ'

పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. గురువారం నాడు ...

Widgets Magazine