11 యేళ్ళ బాలుడిపై 17 యేళ్ల యువకుడి అసహజ లైంగిక దాడి
గురువారం, 6 జులై 2017 (16:45 IST)
హైదరాబాద్ నగరం పాతబస్తీలో ఓ దారుణం జరిగింది. 11 సంవత్సరాల బాలుడిపై 17 యేళ్ళ యువకుడు లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేశాడు. ఈ దారుణం చాంద్రాయణగుట్ట బార్కాస్‌లో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
బార్కాస్ ఏరియాకు చెందిన 11 యేళ్ల బాలుడు గత నెల 28వ తేదీన అదృశ్యమయ్యాడు. దీనిపై ఆ బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు.
స్థానికంగా అమర్చిన సీసీ కెమెరాలు పరిశీలించగా అనుమానితంగా కనిపించిన 17 సంవత్సరాల బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో 11 యేళ్ళ బాలుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు.
బాలుడిని నిందితుడు ప్రభుత్వ పాఠశాల భవనంపైన ఏర్పాటు చేసిన నీళ్లట్యాంక్ వెనుకకు తీసుకుపోయి అసహజ లైంగిక దాడి చేశాడని.. విషయం ఎవరికైనా చెబుతాడనే ఉద్దేశ్యంతో ఇనుపరాడ్‌తో తలపై కొట్టి చంపేశాడని పోలీసులు తెలిపారు.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :
,
,