గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 1 మార్చి 2015 (11:55 IST)

పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తం నియామకం... అసంతృప్తి ఆరంభం..!

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తం కుమార్ రెడ్డిని నియమించడంపై అసంతృప్తి ఆరంభమైనట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు ఆ స్థానంలో ఉన్న పొన్నాల లక్ష్మయ్య అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ఉత్తం కుమార్ నియామకంపై మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, వి.హనుమంతరావులతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. 
 
కోమటి రెడ్డి, ఉత్తం కుమార్‌లు ఇద్దరు నల్గొండ జిల్లాకు చెందిన వారు కావడంతో, అక్కడ వర్గ విబేధాలు ఉండడమే ఈ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. అయితే మల్లు భట్టి విక్రమార్కను వర్కింగ్ అధ్యక్షుడుగా నియమించాలన్న నిర్ణయంపై మాత్రం పెద్దగా అభ్యంతరాలు రావడం లేదని తెలుస్తోంది. కాగా పొన్నం, డి.ఎస్. లను పార్టీ జాతీయ కార్యదర్శులుగా నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది.