గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (20:48 IST)

తమిళనాడు గవర్నరుగా వెంకయ్యనాయుడు...? జోరుగా చర్చ...

ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. కేంద్రంలో నెం.2 పొజిషన్ అని అందరూ అనుకుంటున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడుని త్వరలో తమిళనాడు గవర్నరుగా కేంద్రం నియమించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడుకు గవర్నరుగా కొనసాగుతున్న కె.రోశయ్య పదవీకాలం జూలై నెలతో ముగుస్తుంది. ఈ నేపధ్యంలో ఆయన స్థానంలో వెంకయ్య నాయుడుని నియమించాలని అనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ జూన్ నాటికి తన మంత్రివర్గంలో మార్పులుచేర్పులు చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ క్రమంలో సీనియర్లుగా ఉన్న ముగ్గురు మంత్రుల్లో ఒకరైన వెంకయ్య నాయుడును తమిళనాడు గవర్నరుగా నియమిస్తారని ఢిల్లీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
 
వెంకయ్య నాయుడు రాజ్యసభ సభ్యత్వం కూడా జూన్ నెలతో ముగుస్తుంది కనుక ఆయనను తమిళనాడు గవర్నరుగా నియమించి ఆయన స్థానంలో పట్టణాభివృద్ధి శాఖకు సమర్థుడైన వారిని ఎంపిక చేయవచ్చని అంటున్నారు. కాగా తెదేపా నుంచి ఇప్పటికే మంత్రులుగా ఉన్నవారిలో ఎవరినైనా తీసుకోవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. చూడాలి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయో...?