శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2015 (13:59 IST)

వైద్యం - విద్యా ఖర్చులు పెరిగిపోవడం కూడా రైతుల అత్మహత్యలకు కారణమా?

దేశం వైద్యంతో పాటు విద్యా ఖర్చులు పెరిగిపోవడం కూడా రైతుల ఆత్మహత్యలకు ఓ కారణంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వైద్యుల కొరత తీవ్రంగా ఉందన్నారు. దీన్ని తీర్చేందుకు వైద్య కళాశాలల ఏర్పాటు నిబంధనలను సడలించామన్నారు. 
 
వైద్యం, విద్య ఖర్చులు పెరిగిపోవడం కూడా రైతుల ఆత్మహత్యలకు ఓ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘దేశంలో వైద్యం ఇంకా వెనుకబడే ఉంది. ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వాలు ముందుకు రావాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల దాడిలో చిన్నారి మృతి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో కింది నుంచి పై స్థాయి వరకూ సమూలంగా మార్చాల్సి ఉందని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు.