శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 23 అక్టోబరు 2014 (11:43 IST)

చేపలుప్పాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న వెంకయ్య ఫ్యామిలీ!

హుదూద్ తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్టణం జిల్లాలోని చేపలుప్పాడు గ్రామాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు దత్తత తీసుకున్నారు. ఈ తుఫాను కారణంగా సర్వం కోల్పోయిన ఈ గ్రామ వాసులను అన్ని విధాలుగా ఆదుకోవడమే కాకుండా, ఈ గ్రామాన్ని పునర్మిస్తారు. 
 
ప్రస్తుతం విశాఖపట్టణం జిల్లాలో పర్యటిస్తున్న వెంకయ్య నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ గ్రామాన్ని తమ కుటుంబం పునర్నిర్మిస్తుందని వెంకయ్య తెలిపారు. ఎంపీ నిధుల నుంచి ఈ గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే, తన కుమార్తె నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గ్రామానికి కావాల్సిన అన్ని సౌకర్యలను కల్పిస్తుందని ఆయన వివరించారు.