Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెంకయ్యాజీ.. బడ్జెట్‌పై సంతృప్తి లేదా : అరుణ్ జైట్లీ ప్రశ్న

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:01 IST)

Widgets Magazine
venkaiah - jaitley

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ నుంచి ఓ వింతైన ప్రశ్న ఎదురైంది. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మీకు సంతృప్తి లేదా అని సూటిగా ప్రశ్నించారు. ఈ సరదా ప్రశ్నతో వెంకయ్య ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. 'వెంకయ్యాజీ.. అమరావతి రైతులకు క్యాపిటల్‌ గెయిన్స పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకుని బడ్జెట్‌లో ప్రకటించాను. అయినా మీకు సంతృప్తి లేదా!?' అని జైట్లీ గురువారం ఉదయం తనను కలసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును సరదాగా ప్రశ్నించారు. 
 
ఈ విషయాన్ని వెంకయ్య మీడియాతో పంచుకున్నారు. ‘‘ఒకసారి నేనూ, జైట్లీ అమరావతి ప్రాంతంలో పర్యటించాం. ఆ సందర్భంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, రైతు ప్రతినిధులు మాదాల శ్రీనివాస్‌, జమ్ముల శ్యామకిశోర్‌ తదితరులు మమ్మల్ని కలిశారు. రైతులు భూములు అమ్ముకోలేదని, ప్రభుత్వానికి అప్పగించారని... అందువల్ల పన్ను నుంచి మినహాయించాలని కోరారు’’ అని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. 
 
ఈ అంశంపై తర్వాత కూడా తాను జైట్లీతో చర్చించానని తెలిపారు. రైతుల డిమాండ్‌ న్యాయ సమ్మతమేనని, తాను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని అప్పుడు జైట్లీ తనకు హామీ ఇచ్చారన్నారు. గురువారం ఉదయం తాను ఏపీకి సంబంధించిన ఒక పని గురించి జైటీతో మాట్లాడుతుండగా.. ఈ విషయాన్ని గుర్తు చేశారని చెప్పారు. రైతులకు మేలు చేసినందుకు తాను జైట్లీకి కృతజ్ఞతలు తెలిపినట్టు వెంకయ్య మీడియాకు వివరించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మిస్టర్ ట్రంప్... నేను టెర్రరిస్టునా? సిరియా చిన్నారి సూటి ప్రశ్న... వైరల్‌గా మారిన బాలిక ట్వీట్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సిరియాకు చెందిన ఓ ముస్లిం చిన్నరి సూటిగా ఓ ప్రశ్న ...

news

అమెరికా బాటలో కువైట్.. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం దేశాలపై నిషేధం

అమెరికా బాటలో కువైట్ నడవనుంది. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం మెజారిటీ దేశాలపై కువైట్ ...

news

నిషేధాలు, నిరసనలూ సరే.. ఆ ఏడు దేశాల పిల్లల గతేమిటి: ప్రియాంక చోప్రా ప్రశ్న

అమెరికాలోకి ఏడు ముస్లిం దేశాల ప్రజల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఆ దేశాధ్యక్షుడు ...

news

ఉగ్రవాదులు కాదు.. అమెరికన్ ఉన్మాదులే రియల్ డేంజర్.. షాక్ కలిగిస్తున్న అసలు లెక్కలు

అంకెల కన్నా మించి వాస్తవాలను చెప్పే కొలమానం ఈ ప్రపంచంలో మరేమీ ఉండదు కదా. ఏడు ముస్లిం ...

Widgets Magazine