Widgets Magazine Widgets Magazine

మహిళలు గుర్తింపు లేని హీరోలు.. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ : వెంకయ్య

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (12:15 IST)

Widgets Magazine
venkaiah naidu

దేశ ఆర్థికవ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో మహిళలదే కీలకపాత్రని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో సమీపంలోని పవిత్ర సంగమం వద్ద నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ భారతదేశంలో పురాణాల నుంచి మహిళలకు పురుషులతో సమాన ప్రాధాన్యత ఉందన్నారు. 
 
దేశాన్ని కూడా మాతగానే భావిస్తున్నామని.. లింగ వివక్ష అన్నది మనదేశంలో కృత్రిమంగా వచ్చినదేనని పేర్కొన్నారు. మహిళలు భారత్‌లో గుర్తింపు లేని హీరోలని అభివర్ణించారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని వెంకయ్యనాయుడు అన్నారు. మహిళల్లో వృద్ధి లేకుండా ప్రపంచం వృద్ధి సాధించలేదని వివేకానందుడు చెప్పినట్లు గుర్తుచేశారు. లింగ వివక్షపై ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. మహిళా సాధికారతపై తొలిసారి గళం విప్పింది ఎన్టీఆర్‌ అని వెంకయ్యనాయుడు తెలిపారు. ఆస్తిలో సగభాగం మహిళలకు ఇవ్వొచ్చని నినదించింది ఆయనేనని గుర్తు చేశారు. 
 
అలాగే, ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ ఉంటుందన్నారు. మహిళా సాధికారికతపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలిపారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు మహిళలే పతకాలు తీసుకొచ్చారని అన్నారు. పేద మహిళల శ్రమ వెలకట్టలేనిదని, మహిళల స్థితిగతులు మెరుగుపడకపోతే దేశ అభివృద్ధి సాధ్యంకాదని ఆనాడు వివేకానంద చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా వెంకయ్య గుర్తు చేశారు.
 
మహిళలకు అవకాశాలు ఇస్తే తమ శక్తిని నిరూపించుకుంటారన్నారు. మహిళలపై వివక్ష ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతోందని అన్నారు. పురాణకాలంలో మహిళలకు సముచితస్థానం ఉండేదని, విద్యామంత్రి సరస్వతీదేవి అని, రక్షణ మంత్రి పార్వతీదేవి అని, భారత పితకు జయహో అని ఎవరూ అనరని, భారతమాత అని పిలుస్తామని ఆయన అన్నారు. దేశంలో పవిత్రమైన నదులు బ్రహ్మపుత్ర, గంగా, కావేరీ, యమున, నర్మదా, తపతీ నదులను నదీమాతల్లులనే పిలుస్తున్నామని, కొన్ని దేశాల పేర్లు మహిళల పేర్లుతోనే ఉన్నాయని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

బందీలుగా శశివర్గ ఎమ్మెల్యేలు.. నో ఫోన్.. నో పేపర్.. నో టీవీ.. 'మన్నార్గుడి' సెక్యూరిటీ నీడలో రిసార్ట్స్

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బందీలుగా మారిపోయారు. తొలిరెండు రోజున విలాసవంతమైన గోల్డన్ బే ...

news

వేదనిలయంపై సరికొత్త ట్విస్ట్.. శశికళ మరదలు ఇళవరసిపై వీలునామా? ఎవరు రాశారు?

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న దివంగత జయలలితకు అత్యంత ...

news

చంద్రబాబు కోడలు బ్రాహ్మణితో కవిత.. అమరావతికి రాక.. ఆ సదస్సులో వేదిక పంచుకుంటారా?

నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అమరావతికి చేరుకోనున్నారు. శుక్రవారం ...

news

గోల్డెన్ బే రిసార్ట్‌‌లో ఎమ్మెల్యేల ఎంజాయ్‌మెంట్.. పన్నీర్ వెంట పోతారా? చిన్నమ్మకు ఓటేస్తారా?

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం చెంతకు తన క్యాంప్ ఎమ్మెల్యేలు చేరిపోకుండా శశికళ ...