Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హోదాలో ఏముంది బొంద. అన్నీ ప్యాకేజీలో ఉంటే.. అంటున్న వెంకయ్య

హైదరాబాద్, మంగళవారం, 31 జనవరి 2017 (03:36 IST)

Widgets Magazine
venkaiah naidu
ప్రత్యేక హోదా అంటూ పాత చింతకాయపచ్చడిని పట్టుకు వేళ్లాడుతున్నఏపీ ప్రతిపక్షాలకు కేంద్రం అందిస్తున్న సహాయం కనిపించడం లేదా అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో ఒక అవగాహనతో ముందుకెళుతున్న బీజేపీ, టీడీపీ మధ్య తెగతెంపులే జరిగితే ఏపీకి జరిగే నష్టం మామూలుగా ఉండదని హెచ్చరించారు.
 
ఏపీకి ప్రత్యేకహోదాపై అధినేత పవన్‌‌కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ ఉద్యమం ఉదృతం చేస్తున్న తరుణంలో ఏపీకి కేంద్రం తరపున లభించిన ప్రయోజనాల్ని వెంకయ్య నాయుడు వరుసగా ఏకరువు పెట్టారు. 
 
ప్రత్యేక హోదా ద్వారా ఏడాదికి రూ.3500 కోట్లు మాత్రమే వస్తాయి. విభజన చట్టంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక హోదా చేర్చితే సమస్య ఉండేది కాదు. హోదాతో పనిలేకుండా ఉదయ్ పథకం కింద ఏపీకి చాలా లబ్ధి చేకూర్చాం. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవాలని వైసీపీ అంటోంది. బీజేపీ, టీడీపీ విడిపోతే ఏపీ అభివృద్ధి ఆగిపోతుంది అంటూ వెంకయ్య హెచ్చరించారు.  ఏపీకి ప్రత్యేక హోదాకు మించిన ప్రయోజనాలను తాము కల్పించామన్నారు.
 
విశాఖ రైల్వేజోన్ పెండింగ్‌లో ఉంది. రైల్వేజోన్ రెండు రాష్ట్రాలతో ముడిపడి ఉంది. ఏపీలో ఎయిర్‌పోర్టులు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. సీఎం ముందు చూపుతో వేల ఎకరాలు సేకరించారు. ఏపీకి ప్రధాని అండ ఉంది. 2019 వరకు ఓపిక పట్టండి అంటూ వెంకయ్య ఊరించారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చేసిన తప్పులకు మన్నించండి ఓటరు దేవుళ్లారా.. తన చెప్పుతో తానే దండించుకున్న మాజీ ఎమ్మెల్యే

తప్పులు చేసి ఉంటే మన్నించి మరిచిపోండి. నేనిప్పుడు మారిన మనిషిని. మీ మనిషిని. మీకు సేవ ...

news

ట్రంప్ దెబ్బకు దారికొస్తున్న పాక్: హఫీజ్ సయీద్‌ హౌస్ అరెస్ట్: జమాత్ ఉద్ దవాపై నిషేధం?

భారత్‌కు నిజంగానే ఇది తీపి కబురు. దశాబ్దాలుగా భారత్‌పై విద్వేషమే ఊపిరిగా బతుకుతూ ...

news

ముస్లిం శరణార్థులకు ఉద్యోగాలు, బీమా మేమిస్తాం: అమెరికా సీఈఓల తిరుగుబాటు

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సాఫ్ట్ వేర్, తదితర దిగ్గజ కంపెనీలు తిరుగుబాటు ...

news

శరణార్థులపై ఆంక్షలు కాదు ఉగ్రవాదులకోసం కారుస్తున్న కన్నీళ్లే అసలు సమస్య: గయ్ మన్న ట్రంప్

వివాదాస్పదమైన వలస నిరోధక ఆదేశంపై యావత్ ప్రపంచం మండిపడుతుండగా లైట్ తీసుకోండంటూ అమెరికా ...

Widgets Magazine